మనదేశంలో చాలా మంది యువకులను శృంగారం గురించిన అనేక సందేహాలు వెంటాడుతుంటాయి. వీటిలో ప్రధానమైనది అంగం సైజు గురించిన ప్రశ్న. పరిమాణం పెద్దగా ఉంటేనే భాగస్వామిని సుఖపెట్టగలుగుతామా? అని చాలా మంది యువకులు అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే, దీనికి సెక్సువల్ ఎక్స్‌పర్టులు ఎప్పటిప్పుడు క్లారిటీ ఇస్తున్నా ఇంకా అనేక సందేహాలు యువకుల మెదళ్లలో మెదులుతూనే ఉంటాయి. వాస్తవానికి పురుషాంగం పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సెక్స్‌లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనేది ఒక కళ. ఇందులో భాగమే తన పార్ట్నర్‌ను సెక్స్‌లో సంతృప్తి పరచడం కూడా మెల్లగా తెలుసుకుంటూ ఉంటారు యువకులు.
ఇలా ఇద్దరూ సంతోషంగా, అన్యోన్యంగా ఉండగలిగితే సెక్సువల్ లైఫ్ దానంతట అదే సెట్ అవుతుందని సెక్సాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. మన సమాజంలో శృంగారం గురించి పబ్లిక్‌గా చర్చించుకోవడం నేరంగా చూస్తారు. కొత్తగా శృంగారంలో పాల్గొనాలంటే ఎవరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. వీటిని ఎవరితోనూ చెప్పుకోలేక సతమతం అవుతుంటారు. ముఖ్యంగా అంగం పరిమాణం విషయంలో చిన్నదిగా భావిస్తుంటారు కొందరు యువకులు. ఈ భయంతోనే భాగస్వామిని సంతృప్తిపరచగలుగుతామో లేదో అనే సందేహంతో నూటికి 70 శాతం మంది కుమిలిపోతుంటారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
పోషకాహారం తీసుకోవాలి..
భాగస్వామిని ప్రేమించి.. ఆమెను అర్థం చేసుకుంటే సరిపోతుందని, అంగం పరిమాణం చిన్నదిగా ఉన్నా ఆమెను సంతృప్తి పరచవచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడితే సరిపోతుందంటున్నారు. మరోవైపు మధుమేహం ఉంటే.. అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయని, శీఘ్రస్ఖలనం బాధిస్తుందని కొందరు చెబుతుంటారు. పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు ఆ వైపు రక్త ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. దీంతో, అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. అంతేతప్ప.. మధుమేహం ఉన్న అందరిలోనూ అంగస్తంభన లోపాలు తలెత్తవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా చేసినట్లయితే భాగస్వామితో సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.