నేటి కాలం యువత తక్కవ కాలంలోనే ప్రేమలో పడిపోతున్నారు. ఇంటర్ లోనే ప్రేమా, గీమా అంటూ తెరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రేమించడమే కాకుండా చివరికి అతనినే పెళ్లి చేసుకోవాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుందట. అసలు నేటి కాలం అమ్మాయిలు ఎలాంటి లక్షణాలు కలిగిన ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు? ముఖ్యంగా అబ్బాయిని అమ్మాయి ఏం చూసి ఇష్టపడుతుందనే పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.
ఈ రోజుల్లోని అమ్మాయిలు చాలా ఫాస్ట్. ప్రధానంగా ప్రతీ అమ్మాయి కొన్ని లక్షణాలు కలిగి ఉన్న అబ్బాయిలే ప్రియుడిగా, భర్తగా రావాలని కోరుకుంటారట. అబ్బయి ప్రవర్తన, అలవాట్లు నచ్చిన తర్వాతే అమ్మాయి లవ్ ప్రపోజ్ చేయడం కానీ పెళ్లి చేసుకోవం కానీ చేస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా ప్రతీ అమ్మాయి పెద్దల పట్ల గౌరవాన్ని చూపించే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారట. ఇక ఇదే కాకుండా స్త్రీలను గౌరవించే యువకులనే అమ్మాయిలను కోరుకుంటారని తెలుస్తోంది. ఇకపోతే ప్రతీ అమ్మాయి శుభ్రంగా ఉండాలని ప్రయత్నిస్తుంటుంది.
ఇక తనకు కాబోయే భర్త కూడా పరిశుభ్రతను పాటించే వాడు దొరకాలని అమ్మాయిలు కోరుకుంటారు. రోజు స్నానం చేయకుండా, మాసిన గడ్డంతో ఉండడం, పళ్లు సరిగ్గా తోమకుండా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదట. ఇక దీంతో పాటు అమ్మాయిలు ఫిట్ నెస్ గా ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. నలుగురిలో ఆచూ తూచి మాట్లాడి గౌరవప్రదంగా ఉండే యువకులను అమ్మాయిలు ఇష్టపడతారు. ఇకపోతే మరీ ముఖ్యంగా అమ్మయిలు అబ్బాయిలలో కోరుకునేది మాత్రం.. తనకు జీవితంపై స్పష్టమైన లక్ష్యం, ఎక్కువ సంపాదన, అందరితో చలాకీగా ఉండే అబ్బాయిలను మాత్రమే అమ్మాయిలు ఇష్టపడతారట. ఇక పైన తెలిపిన లక్షణాలు కలిగిన అమ్మాయిలను మాత్రమే అమ్మయిలు ప్రియుడిగా కానీ భర్త కానీ రావాలని కోరుకుంటారట. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి మరి.