అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు థియో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ అంటే అస్థిపంజరం. అది నిజమైన అస్థిపంజరం కాదు. బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు. నిత్యం ఆ బొమ్మతోనే ఉంటాడు. ఈ పిల్లాడు అస్థిపంజరం పక్కన ఉంటేనే భోజనం చేస్తాడు. దానితోనే ఆటలు ఆడతాడు, టైంపాస్ చేస్తాడు. పట్టపగలే హడలెత్తించే అస్థిపంజరంతో దోస్తీ చేస్తున్న ఈ కుర్రోడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
సెప్టెంబరు 15 నుంచి బెన్నీకి, థియోకి మధ్య స్నేహం మొదలైంది. ఓ రోజు జోరు వాన కురుస్తోంది. దీంతో థియో తల్లిదండ్రులు ఇంటి బేస్మెంట్లో ఉన్న వస్తువులను పైకి తెచ్చారు. వాటిలో హాలోవీన్ రోజున ఇంటి బయట తగిలించే అస్థిపంజరం బొమ్మ కూడా ఉంది. అప్పటి నుంచి థియో ఆ బొమ్మను వదలడం లేదు. దీనికి తోడు ఇటీవల ఓ కుక్క అస్థిపంజరాన్ని కూడా కొనిపించుకున్నాడు. ఇటీవల షాపింగ్‌కు వెళ్తే ఆ బొమ్మ అతడి కంట పడింది. థియో ఇప్పుడు ఆ రెండు అస్థిపంజరాలతోనే ఎక్కువ గడుపుతున్నాడు. కొడుకు వింత టేస్టును తల్లి బ్రాడి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వాటిని చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు.
ఆ కుర్రాడు అస్థిపంజరం తో ఎలా ఆటలు ఆడుతున్నాడో ఈ వీడియోలో చూడండి.
Toddlers are the best! My son and his skeleton Benny pic.twitter.com/ridnYwxDHt
— Abigail Brady (@abigailkbrady) September 21, 2020