ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. దీంతో ఒక్క ధోని ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ఇప్పుడు ధోని జపం పాకిస్థాన్ లో కూడా వినిపిస్తుంది. మరి ఇంతకీ పాకిస్థాన్ అభిమానులు ఎం చేశారో ఇప్పుడు చూద్దాం.
భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని.. అస్సలు తగ్గడం లేదు. ధోనికి దేశమంతా అభిమానులు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసినా.. మరి ఇంత సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారని ఈ ఐపీఎల్ చూస్తే అర్ధం అవుతుంది. చెన్నై, జైపూర్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇలా ధోని నాయకత్వం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉందంటే.. అక్కడ ఎల్లో కలర్ తో స్టేడియం నిండిపోతుంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ఇప్పుడు ధోని జపం పాకిస్థాన్ లో కూడా వినిపిస్తుంది. మరి ఇంతకీ పాకిస్థాన్ అభిమానులు ఎం చేశారో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ధోని సేన 5 వికెట్ల తేదాత్ ఘన విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో పది పరుగులు అవసరమైన దశలో జడేజా.. 6,4 తో మ్యాచ్ ని ముగించి చెన్నైకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. దీంతో ఒక్క ధోని ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే చెన్నై జట్టు విజయం సాధించిన అనంతరం పాకిస్థాన్ లో ధోని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం.
గత కొంత కాలంగా పాకిస్థాన్, భారత్ క్రికెట్ బోర్డుల మధ్య బాగా దూరం పెరిగిపోయింది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా , బీసీసీఐలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ధోని అభిమానులు ఐపీఎల్ లో చెన్నై టైటిల్ గెలవడంతో అభిమానులు సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకాయి. ధోని కటౌట్ లతో వీధులు తిరుగుతూ.. భారీ ఎత్తున కేక్ కటింగ్స్ నిర్వహించారు. ఇలా దాయాధి దేశాలు కూడా ధోని మీద అభిమానం చూపిస్తుంటే ప్రపంచంలోనే ధోని అజాత శత్రువు అనే ఫీలింగ్ ప్రతి భారతీయుడికి కలుగుతుంది. ఇక పాకిస్థాన్ క్రికెటర్లు అయినటువంటి రమీజ్ రాజా, సక్లైన్ ముస్తక్, సయీద్ అన్వర్, షోయబ్ అక్తర్ కూడా చెన్నై టీంకి అభినందనలు తెలిపారు. మరి ఇలా పాకిస్థాన్ వీధుల్లో కూడా ధోని మీద అభిమానం చూపించడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.