ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. నాలుగు ఓవరుస ఓటముల తర్వాత.. విజయం అందుకున్న CSK ఆ టెంపోను కొనసాగించలేకపోయింది. ఆదివారం కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో తేడా ఓడింది. చివరి వరకు మ్యాచ్ చెన్నై చేతుల్లోనే ఉన్నా.. రషీద్ ఖాన్ వీరవిహారంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కానీ చివరి ఓవర్‌లో జీటీకి 13 పరుగులు అవసరం అవ్వగా.. తొలి రెండు బంతులను CSK బౌలర్ జోర్దాన్ డాట్స్ బాల్స్‌గా వేశాడు.
దీంతో 4 బంతుల్లో 13గా ఇక్వేషన్ మారిపోయింది. ఈ దశలో మూడో బంతిని మిల్లర్ సిక్స్ కొట్టాడు. దీంతో జీటీకి మ్యాచ్‌పై కొంత ఆశ వచ్చింది కానీ.. సిక్స్ తర్వాత CSK మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పరిగెత్తుకు వచ్చి.. జోర్దాన్‌తో తర్వాతి బంతి ఎలా వేయాలో చర్చించాడు. జోర్దాన్‌కు దిశానిర్ధేశం చేశాడు. తర్వాతి బంతిని జోర్దాన్ ఫుల్‌టాస్‌గా వేశాడు. దీంతో మిల్లర్ ఆ బాల్‌కు స్లిప్‌లో ఉన్న మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు. కానీ.. దాన్ని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించారు. ధోని ఇచ్చిన సలహాతోనే జోర్దాన్ ఆ బాల్ వేసినట్లు సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ధోని వచ్చి మాట్లాడకుంటే.. ఫలితం వేరేలా ఉండేదేమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అది నో బాల్ కాకుంటే చెన్నైకు విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే జీటీ అప్పటికే 8 వికెట్లు కోల్పోయింది. మిల్లర్ తర్వాత వచ్చేది బౌలర్లు కానుక.. 3 బంతుల్లో 7 పరుగులు అంత సులువుగా వచ్చేవి కావు అని ఫ్యాన్స్ అంటున్నారు. జోర్దాన్ వేసిన నో బాల్‌తో 3 బంతుల్లో 6 పరుగులు అవసరం అయ్యాయి జీటీకి. తర్వాతి బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్, 5వ బంతికి రెండు పరుగులు తీసి తన జట్టుకు విజయం అందించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK చేతుల్లోంచి గెలుపును లాక్కున్న రషీద్ ఖాన్, మిల్లర్
#CSKvsGT
The ball u The reason u
know don’t Know pic.twitter.com/S6FXSO8GQm— 𝐚𝐪 (@aqqu___) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.