సోదర సోదరీమణుల మధ్య బంధానికి గుర్తు రాఖీ పండుగ. ఈ ఏడాది ఆగస్టు 9 రేపు జరగనుంది. ఈ క్రమంలో రాఖీ ఎలా కట్టాలి, ఎన్ని ముడులు వేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలనే ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం.
రాఖీ లేకా రక్షా బంధన్ ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రేపు ఆగస్టు 9న దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య రాఖీ పండుగ కన్పిస్తుంది. రాఖీ వెనుక పౌరాణిక నేపధ్యం ఉంది. దేవతలు, రాక్షసుల యుద్ధం నేపధ్యం ఉంది. యమ ధర్మరాజు, యమున మధ్య రాఖీ బంధం ఉంది. అయితే చాలామందికి అసలు రాఖీ పండుగకు నియమాలు కొన్ని ఉంటాయని తెలియదు. రాఖీ ఎలా కట్టాలి, ఎన్ని ముడులు వేయాలనేది కూడా తెలియదు. యధాలాపంగా రాఖీ కట్టకూడదని ఎవరికీ తెలియదు. ఇప్పుడా వివరాలు మీ కోసం
రాఖీ ఎలా కట్టాలి, ఏ దిశలో కూర్చోవాలి
జ్యోతిష్యం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టే ప్రదేశాన్ని గంగాజలంతో శుభ్రం చేయాలి. ఓ ప్లేటులో రాఖీతో పాటు పువ్వులు, కుంకుమ, అక్షింతలు, దీపం, స్వీట్స్ అమర్చుకోవాలి. రాఖీ కట్టే సమయంలో మహిళలు తమ సోదరుడిని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఎదురు దిశలో కూర్చుని రాఖీ కట్టాలి. పూజ గది దిశ అయితే మరీ మంచిది
రాఖీ ముహూర్త సమయం ఎప్పుడు
రాఖీని ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రేపు ఆగస్టు 9వ తేదీ ఉదయం 9.08 గంటల నుంచి 10.47 గంటల వరకు రాఖీ కట్టకూడదు. ఉదయం 5.47 గంటల నుంచి మద్యాహ్నం 1.24 గంటల వరకు మంచి సమయం. అంటే రేపు రాఖీ కట్టేందుకు 7 గంటల 37 నిమిషాల సమయం ఉంది.
రాఖీ ఎన్ని ముడులు వేయాలి
రాఖీ కట్టే సమయంలో సోదరుడి తల లేదా భుజంపై రుమాలు వంటి వస్త్రం వేసి కుంకుమ బొట్టు పెట్టాలి. కుడి చేతి మణికట్టుకే కట్టాలి. మూడు ముడులు మాత్రమే వేయాలి. ఈ మూడు ముడుల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు.