ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ..ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవ్వరితో పుడుతుందో ఎవరూ ఊహించలేరు. పరియం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారి తీస్తుంది. అయితే అన్ని ప్రేమలు పెళ్లి పీటలు ఎక్కవు. కొన్ని బ్రేకప్, ఇతర కారణాలతో పెళ్లి వరకు చేరవు. కొంత మంది తాము ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు. ఇటీవల కాలంలో పురుషులు, పురుషులు, స్త్రీలకు స్తీలు, టాన్స్ జెండర్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లిళ్లు కూడా భారత్‌లో కామన్‌గా మారిపోతున్నాయి. అయితే వీరి ప్రేమల్ని పెళ్లి పీటల వరకు చేరేందుకు ఎన్నో అగచాట్లు పడ్డారు. అయితే ప్రేమ పేరుతో ఓ ట్రాన్స్ జెండర్ మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచచింది.
మంచిర్యాల జిల్లాలో ఓ ట్రాన్స్ జెండర్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందని, తనతో పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో ఓ ట్రాన్స్‌జెండర్ యువతిని అత్యంత దారుణంతో కత్తితో పొడిచింది. మందమర్రి మండలంలోని ఫారెస్ట్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. అయితే వీరిద్దరూ ఒకే రూంలో ఉంటున్నారని సమాచారం. ట్రాన్స్ జెండర్ పెరుగు మహేశ్వరి కత్తితో పొడవడంతో సల్లూరి అంజలి అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు విడిచింది. అయితే దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్ కూడా కత్తిపోట్లకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరు ఉంటున్న రూమ్ లోనే మరో ఇద్దరు కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన పెరుగు మహేశ్వరి (ట్రాన్స్‌జెండర్), ఆమె చెల్లెలు పరమేశ్వరి, విగ్నేష్ అనే మరో యువకుడు మంచిర్యాలలో ఓ రూమ్ తీసుకుని ఉంటున్నారు. మందమర్రికి చెందిన అంజలి కూడా అదే గదిలో ఉంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. పరమేశ్వరీ కూడా అదే ఆసుపత్రిలో పనిచేస్తుంది. ట్రాన్స్‌జెండర్ మహేశ్వరి పెట్రోల్ బంకులో పని చేస్తోంది. విగ్నేష్ బేకరిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అంజలితో స్నేహం పెంచుకున్న మహేశ్వరి.. ఆమెపై ప్రేమను పెంచుకుంది. వీరిద్దరూ మనసు పడి సహజీవనం చేశారని వార్తలు వచ్చాయి. అయితే అంజలి.. శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి..ప్రేమగా మారింది. అయితే 2 నెలలుగా అంజలి శ్రీనివాస్‌తో చనువుగా ఉంటూ మహేశ్వరిని దూరం పెట్టింది. దీంతో మహేశ్వరి తట్టుకోలేకపోయింది. దీని విషయంలో వీరికి గొడవలు కూడా జరిగాయి. తనను పెళ్లి చేసుకోవాలని అంజలిపై ఒత్తిడి తెచ్చింది మహేశ్వరి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి పనికి వెళ్లొచ్చిన అంజలిని బయటకు వెళ్లామని మహేశ్వరి చెప్పింది. వీరిద్దరు కలిసి రాత్రి 8 గంటల సమయంలో మామిడిగట్టుకు వెళ్లారు. ఆ తరువాత 11 గంటల సమయంలో శ్రీనివాస్‌కు మహేశ్వరి నుండి ఫోన్ వచ్చింది. అంజలి ఆత్మహత్య చేసుకుందని..తాను చేసుకుంటానని చెప్పింది. దీంతో కంగారు పడ్డ శ్రీనివాస్ ట్రాన్స్ జెండర్ మహేశ్వరి సోదరి పరమేశ్వరిని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లాడు. అప్పటికే అంజలి రక్తపు మడుగులో పడి ఉంది. మహేశ్వరి కూడా గాయాలతో ఉంది. అయితే అంజలిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అలాగే అంజలి శరీరంపై గాయాలు ఉండడంతో మహేశ్వరే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్వరి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు.