హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పానీపత్ జిల్లాలోని సమాలఖా గ్రామంలో ఓ దంపతులకు ఏడేళ్ల బాలిక ఉంది. అయితే బాలిక ఆదివారం పక్కనున్న మనానా గ్రామంలో ఓ గుడి వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా బాలికను కొందరు దుండగులు వచ్చి కిడ్నాప్ చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా బాలికపై పాశవికంగా నోట్లో రాళ్లు పెట్టి దారుణంగా హత్య చేశారు.
అనంతరం ఆ బాలిక మృతదేహాన్ని గ్రామ శివారులోని ఓ స్టేడియంలో వదిలేసి పరారయ్యారు. ఇకరాత్రి అయినా తమ కూతురు ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు ఖంగారు పడ్డారు. ఊళ్లో అంతా వెతికి తమ బంధువులకు సమాచారాన్ని చేర వేశారు. అయినా ఆ బాలిక జాడ కనిపించలేదు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా అంతటా వెతికారు. ఇక పోలీసులకు మంగళవారం సాయంత్రం స్టేడియం వద్ద ఉందన్న సమాచారం అందింది.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకు దొరకకపోవడంతో నిందితులను పట్టిస్తే రూ.50 వేల నగదును రివార్డ్ ను ఇస్తామని ప్రకటించారు. తాజాగా హర్యానాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై నిందితులు చేసిన ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
