నేటికాలంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మానవ మృగాలు ఆడవారిపై ఆకృతాయలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. నెలల పసిపాప నుంచి పండు ముసలావిడ వరకు ఎవర్ని వదలకుండా కొందరు కామాంధులు బరితెగిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కామంతో కళ్లు మూసుకుపోయిన కొన్ని మనిషి రూపంలో ఉన్న చిత్తకార్తె కుక్కులు.. నోరులేని జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఒకటి జరిగింది. గంజాయి మత్తులో ఉన్న కొందరు మద్దమెక్కి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఊపిరి ఆడని ఆ మూగజీవి మృతి చెందింది. ఈ దారుణమైన ఘటన బుధవారం యానాంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యానాంకు చెందిన పొగాకు ఈశ్వరరావు అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈశ్వరరావుకు చెందిన ఆవుపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. ఆవు నాలుగు కాళ్లను, మెడను తాళ్లతో కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో గంజాయి తాగిన ఆనవాళ్లు స్ఫష్టంగా ఉన్నాయి. గంజాయి మత్తులో మదమెక్కి ఆవుపై కొందరు అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున కొబ్బరితోటకు వెళ్లిన ఈశ్వరరావుకు ఆవు చనిపోయి ఉండటం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం అందించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచాలని పోలీసులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన ఆవును పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్ పరిశీలించారు. కాళ్లు, మెడ కట్టేయడంతో ఊపిరాడక పోవడంతో ఆవు మృతి చెంది ఉంటుందని కదిరేశన్ తెలిపారు. మూగజీవాలపై లైంగిక, ఇతర దాడులకు పాల్పడటం చట్ట రీత్యా తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మత్తులో మదమెక్కి ఆవుపై అత్యాచారం చేసిన ఆగంతుకులు.. మృతి చెందిన మూగజీవి#eastgodavari #yanam #Andrhapradesh #eenadu #TeluguNews https://t.co/12j0oIhk4k
— Eenadu (@eenadulivenews) January 13, 2023