సాధారణంగా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉందంటే ఆమె ఆశయ కోసం ఏ భర్త అయినా మద్దతు ఇస్తాడు. ఆమె లక్ష్యం కోసం భర్త.. తన వంతు సహయం కూడా చేస్తుంటాడు. ఆ క్రమంలో భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే భర్త ఎగిరి గంతేస్తాడు . అందరికి స్వీట్ పంచి.. తన ఆనందాన్ని నలుగురితో పంచుకుంటాడు. కానీ ఓ భర్త మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించాడు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆమె చెయి నరికేశాడు. ఈ ఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వెస్ట్ బెంగాల్ లోని తూర్పు బుర్ధ్వాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్ రేణు ఖాతున్ భార్యభర్తలు. రేణు దుర్గాపూర్ లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇటీవల బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాస్తై ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడం ఆమె భర్త షేర్ మహ్మమద్ కు ఇష్టం లేదు. ఉద్యోగంకి వెళ్తే తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందని భయపడ్డాడు. దీంతో ఆమెను ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు. ఈక్రమంలో దంపతుల మధ్య గోడవలు జరిగాయి. ఆ సమయంలో భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకుందామని యువకుడు ఆత్మహత్య!అయితే చికిత్స చేసిన వైద్యులు ఆమె చెయిని తొలగించి వైద్యం చేశారు.”రేణు ఖాతున్, షేర్ మహమ్మద్లకు చదువుకునేటప్పటి నుంచే పరిచయం ఉంది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాక.. వీరి పెళ్లి చేశాం. రూ. లక్ష నగదు, బంగారు ఆభరణాలు, సామాన్లు కట్నం కింద ఇచ్చాం. అయితే షేర్ మహమ్మద్.. రేణు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే షేక్.. రేణు చేతిని నరికేశాడు.” అని రేణు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఘటనపై రేణు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.