నేటి సమాజంలో మాయ మాటలతో ఆడపిల్లను ట్రాప్ చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. అమాయకపు ఆడపిల్లలు వారి ట్రాప్ లో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు బాలికను ట్రాప్ చేసి.. మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు.
నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టినది మొదలు.. తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనిషి రూపంలో ఉన్న కొన్ని మృగాలు ఎప్పుడు తమపై ఘోరాలకు పాల్పడుతాయో అని భయంతో బతుకున్నారు. మరికొందరు పశువులు బాలికలకు మాటలు చెప్పి..శారీరకంగా వాడుకుని మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన ఆడపిల్లలపై అఘాయిత్యాలను జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి.. మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కొండారెడ్డి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు మాయమాటలతో బాలికను ట్రాప్ చేశాడు. అనంతరం మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం చేసిన తరువాత బాలికను కొండారెడ్డి కాలనీ సమీపంలోని చెట్ల పొదల్లో పడేశాడు. బాలికను ట్రాప్ చేసేందుకు ఆ యువకుడికి ఓ వివాహిత మహిళ కూడా సహకరించింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు యువకుడిపై దాడి చేశారు. అతడిని రోడ్డుపై పడేసి కాళ్లతో తంతూ చితకబాదారు. నిందితుడిని పట్టుకుని బాధితురాలి బంధువులు చితకబాది అనంతరం మార్కాపుర పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని, అతడికి సహకరించిన వివాహిత మహిళను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. బాలికలను ట్రాప్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతున్న ఇలాంటి మానవ మృగాలను ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.