ఆ ఇంటి రెండు వారాల కిందటే పెళ్లి జరిగింది. పెళ్లి వేడకు వేసిన తోరణాలు అలాగే ఉన్నాయి. ఇంతలోనే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిపోయాయి. నవ వరుడు, అతడి తండ్రి కలిసి భార్యను అత్తను కత్తితో దారుణంగా పొడిచి హతమార్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన, మరపురాని ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కలలు కంటుంది. అలానే ఎందరో యువతి, యువకులు పెళ్లి అనే బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంటారు. ఇక పిల్లల పెళ్లిలో ఇరు కుటుంబ సభ్యుల సందండి మాములుగా ఉండదు. అయితే ఇలా ఎన్నో జంటలు వైభవంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాయి. కొన్ని జంటలు మాత్రం పెళ్లైన రోజుల వ్యవధిలోని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నాయి. కారణాలు ఏమైనప్పటికి పెళ్లైన కొద్ది రోజులకే పెళ్లి ఇంట విషాదాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఘోరం చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులకే ఓ వ్యక్తి భార్యను కత్తితో అత్యంత దారుణంగా పొడి చంపాడు. అలానే అదే ఇంట్లో వియ్యపురాలిని వియ్యంకుడు హత్య చేశాడు. ఇక ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా కల్లూరు చింతల మునినగర్ లో ప్రసాద్, కృష్ణవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రావణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు గతంలో కొంతకాలం వాలంటీరుగా పని చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఇక శ్రావణ్ తల్లి గృహిణీ కాగా, తండ్రి ఇండ్లీలు అమ్మేవాడు. అయితే శ్రావణ్ కు తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమార్తె రుక్మిణితో శ్రావణ్ కు మార్చి 1న వివాహమైంది. అయితే వీరి పెళ్లి కూడా చాలా తక్కువ మంది బంధువుల సమక్షంలో జరిగింది.
ఇక పెళ్లి అనంతరం రుక్మిణీ అత్తారింటికి కర్నూలులోని చింతలమునిగర్ కు వచ్చింది. తనకు ఆఫీస్ లో పని ఉన్నాదని చెప్పి.. రుక్మిణీని ..ఆమె పుట్టింట్లో వదిలి.. శ్రావణ్ హైదరాబాద్ వెళ్లాడు. అయితే అప్పటి నుంచి భార్య రుక్మిణిపై అనుమానిస్తూ శ్రావణ్ వేధించేవాడని సమాచారం. అలానే శ్రావణ్ మొదటి రోజు నుంచి తనకు దూరంగా ఉన్నట్లు రుక్మిణీ.. తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. ఈ విషయమై వారు వియ్యంకుడితో గొడవ పడుతూ తమ కుమార్తెకు అన్యాయం జరిగిందని బాధ పడేవారు. ఈ క్రమంలో మార్చి 10వ తేదీన శ్రావణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కోడలి తల్లిదండ్రులు తమ కుమారుడి పరువు తీయడంతోనే ఇలా జరిగిందని ప్రసాద్ పగ పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని కుమారుడు శ్రావణ్ కు ప్రసాద్ చెప్పి.. రుక్మిణితో సహా ఆమె కుటుంబాన్ని చంపాలని పథకం రచించాడు. ఇక పథకం ప్రకారం.. శ్రావణ్ వనపర్తి వెళ్లి అత్తామామలను, భార్యను మంగళవారం కర్నూలులోని తన ఇంటికి తీసుకొచ్చాడు. వారిని ఇంట్లోనే మొదటి అంతస్తు తీసుకెళ్లారు. అనంతరం రుక్మిణిని శ్రావణ్ కత్తితో పొడిచి చంపాడు. అతడి తండ్రి ప్రసాద్ రుక్మిణీ తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో రమాదేవి వరండాలో కుప్పకూలి ప్రాణాలు వదిలారు.
వెంకటేశ్వర్లు తీవ్రగాయలతో బయటపడగా, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం శ్రావణ్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. ఈఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరి.. ఏవైనా సమస్యలు ఉండే పరిష్కరించుకోవాలే కానీ ఇలా హత్యలు చేయడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.