రక్త సంబంధికుల ప్రాణాలు కళ్ల ముందే పోతుంటే..చూస్తూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే… ఆ నరకం వర్ణాతీతం. తాజాగా ఓ బాలిక కళ్ల ముందే.. తన చెల్లి ప్రాణాలు పోయాయి. చిన్నారి చెల్లిని కాపాడేందుకు ఆ అక్క ఎంతో తాపత్రయపడింది. కానీ ఆ సోదరి ప్రయత్నం విఫలమై.. చెల్లి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఘటన శనివారం సాయంత్రం కుమురం భీం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్ లోని దక్కింసేతం గ్రామానికి చెందిన భక్త బిస్వాస్, పాణేశ్వరి భార్యభర్తలు. వీరికి ఇద్దరు పాపలు, ఓ కుమారుడు. వారిని తీసుకుని బతుకుదెరువు కోసం కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వచ్చారు. అంకుసాపూర్ లో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా ఆసుపత్రి భవనం వద్ద రాడ్ బైండర్ గా కూలీ పనిచేస్తున్నారు. పక్కనే గుడారాలు వేసుకొని నివాసముంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరి కూతుళ్లు పాకి బిస్వాస్(8), వర్ష బిస్వాస్ లు ఊయల ఊగుతున్నారు. అలా ఇద్దరు ఊయల ఊగుతూ సంతోషంగా ఉన్న గడుపుతున్నారు. చెల్లి పాకి బిస్వాస్.. అక్క కంటే ఇంక బాగా ఊయల ఊగాలన్న తాపత్రయంలో గబగబా ఊయల ఎక్కే క్రమంలో పట్టుతప్పింది.
ఆసరాగా వేసుకున్న కుర్చీ కిందపడటంతో ఊయలే ఉరితాడై మెడకు బిగుసుకుంది. అక్క గట్టిగా అరుస్తూ కాపాడానికి ప్రయత్నించింది. ఆ పాప అరుపులు విన్న తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వచ్చేసరికే.. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించిన ప్రాణాలు దక్కలేదు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు సంతోషంగా ఆడుకున్న కూతురు క్షణాల వ్యవధిలో విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఈఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులు ఎంత పనుల్లో బిజీగా ఉన్న పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేకుండే ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
ఇదీ చదవండి: అలా ఉండగా వీడియోలు తీసి ఆ వెబ్‌సైట్‌కు అమ్మాడు!