ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించి విలువనైది, సాటి వచ్చేది ఏమిలేవు. నవమోసాలు మోసి, కని, పెంచి బిడ్డను పెద్ద చేస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డలు పెరిగి పెద్దవారైనా కూడా తల్లి.. బిడ్డలను కంటిక రెప్పల చూసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలను తమను ఎంత వేధించినా భరిస్తూ.. పిల్లలు బాగుంటే చాలని కోరుకుంటారు. అయితే ఓ తల్లి మాత్రం తన కుమారుడిని దారుణంగా హత్య చేసింది. అయితే ఆ తల్లి కొడుకు ప్రాణాలు తీస్తే స్థితికి వచ్చిందంటే.. అతడు ఎంతలా ఆమెను, కుటుంబ సభ్యులను బాధపెట్టి ఉంటాడో ఊహించవచ్చు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామానికి చెందిన సీతారామాంజనేయులు, రమాదేవి దంపతుల కుమారుడు ఉప్పలపాటి దీప్ చంద్(29). అతడు స్థానికంగా గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. దీప్ చంద్ కి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రులతో కలిసే సొంత ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అతడి తండ్రి డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీప్ చంద్ కూలీ పనులు చేసే క్రమంలో ఇతరుల వద్ద అప్పులు చేసేవాడు. అతడు చేసిన అప్పులు ఎక్కువ కావడంతో పాటు తిరిగి కట్టడం లేదు. ఇదే విషయంలో తల్లీకొడుకు మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారు జామున దీప్ చంద్ తండ్రి బయటకి వెళ్లాడు. ఆయన వెళ్లిన కాసేపటికి తల్లి రమాదేవికి కూడా పాలు తీసేందుకు బయటకు వెళ్లింది.
అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా దీప్ చంద్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారిని పోలీసులు విచారించగా.. తల్లి, కుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో మృతుడి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా హత్యకు సంబంధించిన అసలు విషయాలు బయటకు వచ్చాయి.
తన కుమారుడు పెద్ద మొత్తంలో అప్పులు చేశాడని, అప్పు ఇచ్చిన వారు తరచూ ఇంటి వద్దకు వస్తుండటంతో పరువుపోతుందని తల్లి రమాదేవి భావించారంట. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నిద్రమత్తులో ఉన్న దీప్ చంద్ తలపై రోకలి బండతో నాలుగు సార్లు మోదినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లి రమాదేవి వినియోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయపాల్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం దీప్ చంద్ మృతదేహాన్ని తండ్రి సీతారామంజనేయులకు అప్పగించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.