సినిమా స్టార్లకు, క్రికెటర్లకు అభిమానులు, వీరాభిమానులు ఉండడం సహజం. వీరు తమ అభిమాన స్టార్లను కానీ, క్రికెటర్లను కానీ మాట పడనివ్వరు. స్నేహితుల మధ్య ఇలాంటి వాదోపవాదనాలు నిత్యం జరిగేవే. అయితే తమిళనాడు, అరియలూర్ జిల్లాలో ఇద్దరి స్నేహితుల మధ్య మొదలైన ఇలాంటి చిన్న వాదన.. హత్యకు దారితీసింది. తన అభిమాన క్రికెటర్లను దూషించాడనే కారణంతో స్నేహితుడినే చంపేసాడు ఓ క్రికెట్ అభిమాని. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటారా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.
సమాచారం ప్రకారం.. తమిళనాడు, అరియలూర్ జిల్లాకు చెందిన ఇద్దరూ స్నేహితులు మద్యం సేవిస్తూ.. భారత క్రికెట్ జట్టు గురించి చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య టీమిండియా బలాల గురుంచి వాడి వేడిగా ఈ చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాణం కోల్పోయిన యువకుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బండ బూతులు తిట్టాడని తెలుస్తోంది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు.. తమ అభిమాన క్రికెటర్లను తిట్టడం సహించలేక మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
In today’s news: in a TN Village Ariyaloor, a young man kills his friend with an Arivaal (Big Knife) for talking bad about Rohit & Virat, while they were going out to have a drink. pic.twitter.com/YN1bCp2McI
— Srini Mama (@SriniMaama16) October 13, 2022
ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగా.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చంపుకునేంత అభిమానం ఏంట్రా? అని కామెంట్ చేస్తున్నారు. భారత్‌లో క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అభిమాన క్రికెటర్ల కోసం కొట్టుకున్న ఘటనలు ఉన్నాయే తప్పా చంపుకోవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో బ్యానర్లు, కటౌట్ల విషయంలో విరాట్, రోహిత్ అభిమానులు కొట్టుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Let’s gooo 🌟👇🏻#teamindia #t20worldcup #viratkohli #rohitsharma #cricket #indiancricketteam pic.twitter.com/3gIgcGEQP6
— Sportskeeda (@Sportskeeda) October 12, 2022