ఆమె పేరు మౌనిక (31). సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం పెద్దచెప్యాల. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడితో మౌనికకు గతంలో వివాహం జరిగింది. భర్త సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో ఇద్దరు కలిసి ఆల్వాల్‌లోని సాయిబాబానగర్‌లో నివాసముంటున్నారు. ఇక పెళ్లైన కాలం నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించారు. అయితే కొన్నాళ్లకి శ్రీకాంత్ రెడ్డి భార్య మౌనిక గర్భవతి అని తెలిసింది. దీంతో శ్రీకాంత్ రెడ్డి భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటూ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు.
ఇక భార్య మౌనికకు నెలలు నిండడంతో ఇటీవల పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే శ్రీకాంత్ రెడ్డి మౌనికను ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్‌సీఏల్ నార్త్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేసి మౌనిక ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని తెలిపారు. దీంతో మౌనిక భర్త శ్రీకాంత్ రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం ఎలాంటి ఖంగారు లేకుండా ఉన్నారు.ఇక ఉన్నట్టుండి ఉదయం నుంచి మౌనిక ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు సాయంత్రం ఆపరేషన్ థియేటర్‌లో ఫిట్స్ రావడంతో గుండెపోటుతో మరణించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kadapa: ముగ్గురు భర్తల భార్య! ఓ రోజు మూడో భర్తకి అనుమానం మొదలై..!
ఈ వార్త తెలుసుకున్న భర్త శ్రీకాంత్ రెడ్డికి, ఆమె తల్లిదండ్రులకు గుండె పగిలినంత పనైంది. ఇది కలనా లేక నిజమా అన్నట్లుగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై కన్నెర్ర చేశారు. వైద్యుల నిర్లక్షం కారణంగానే మౌనిక మరణించిందంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇక ఇంతటితో ఆగని బాధితులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.