crime news : కర్ణాటక రాష్ట్రం.. తుముకూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహుద్ద ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 8 మంది మృత్యవాత పడగా మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఏపీ- కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పల్లవహల్లి కట్ట వద్ద శనివారం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు హోసకోటనుంచి పావుగడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.