స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చిన మగవారికి ఆడవాళ్ళని ఎరగా వేసి వ్యభిచార దందా నడుపుతున్నారు. మరికొంతమంది డ్రగ్స్ అడ్డాగా కూడా ఈ స్పా, మసాజ్ సెంటర్లను వాడుకుంటున్నారు. దేశంలోనే ప్రధాన నగరాల్లో యువకులే టార్గెట్ గ డ్రగ్స్, సె*క్స్ రాకెట్ యదేచ్ఛగా సాగిస్తున్నారు. గుట్టుగా తమ దందా సాగిస్తున్నారు. ఎవరో ఒకరు సమాచారం ఇస్తే పోలీసులు రంగంలోకి దిగి వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్న ఘటనలు గతంలో చాలానే చూశాం. అయినా గానీ కొంతమంది ఏ మాత్రం భయం లేకుండా దందాను సాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో పలు స్పా సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్పా సెంటర్లపై దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో 15 మందిని అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం నడుస్తోందన్న పక్కా సమాచారంతో పోలీసులు చేరుకొని స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. స్ప్రింగ్ వెల్ స్పా, మసాజ్ సెంటర్, అవంతి స్పా, మసాజ్ సెంటర్, సారా వెల్నెస్ స్పా మసాజ్ సెంటర్, స్నో యూనిసెక్స్ స్పా, మసాజ్ సెంటర్లను మూసివేశారు. స్పా, మసాజ్ సెంటర్ల యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.