దొంగలు పక్క ప్లాన్ తో చోరీలకు పాల్పడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందు చిన్న క్లూ లేకుండా చోరీలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎంతో జాగ్రత్తగా చోరీలు చేస్తున్నప్పటీకీ వారు చేసే చిన్న తప్పులు పోలీసులకు దొరికేలా చేస్తాయి.
నేటి సమాజంలో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. నిరంతరం కష్టపడి శ్రమించే ఉన్నత స్థితికి ఎదిగేవారు కొందరు అయితే.. దొంగతనాలను, అసాంఘిక కార్యకలాపాలతో ధనార్జన చేసే వారు ఇంకొందరు. ముఖ్యంగా డబ్బుపై ఆశతో తమను ఎంతగానో నమ్మిన వారినే నిట్ట నిలువునా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసి డబ్బులను, నగలను దొచుకుంటున్న వారు.. ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతున్నారు. హైదరాబాద్ లో రూ.7 కోట్ల విలువైన వజ్రాలను దొంగిలించిన వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు చేసిన ఓ చిన్న తప్పు పోలీసులకు దొరికేలా చేసింది. మరి.. అతను ఎలా దొరికిపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 17న శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.7 కోట్ల విలువైన వజ్రాలతో ఉడాయించిన విషయం తెలిసిందే. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం… మాదాపూర్ లో ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారీ వద్ద శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17 అనూష అనే మహిళకు రూ. 50 లక్షల విలువైన వజ్రాభరణాలను ఇచ్చేందుకు రాధిక సేల్స్ మెన్ అక్షయ్ తో కలిసి మధురానగర్ కు కారులో వెళ్లింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రూ.7 కోట్ల విలువైన వజ్రాలు ఉన్న కారుతో ఉడాయించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు కారు నంబరు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వజ్రాలతో ఉడాయించిన శ్రీనివాస్ కారును కూకట్ పల్లి సమీపంలోని మెట్రో మాల్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో వదిలి పెట్టాడు. అనంతరం నగల బ్యాగు తీసుకుని ఆటోలో రాధిక ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లాడు. అక్కడ ఉన్న తన బైక్ ను తీసుకుని పారిపోయాడు. మొదట శ్రీశైలం వైపు వెళ్లిన శ్రీనివాస్.. కాస్తాం దూరం వెళ్లిన తరువాత నర్సంపేట్ లో ఉండే బంధువు ఇంటికి వెళ్లాడు. తన వద్ద పాత సెల్ ఫోన్ ఉంటే పోలీసులకు దొరికి పోతానని భావించిన శ్రీనివాస్ కొత్త ఫోన్ కొనేందుకు ప్రయత్నించాడు.
క్రమంలో పెట్రోలు ఖర్చుల కోసం రాధిక ఇచ్చిన డెబిట్ కార్డుతో సెల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ ఫోన్ ను తన బంధువుకు ఇచ్చి అతడి వద్ద ఉండే ఫోన్ ను తాను తీసుకున్నాడు. డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఫోన్ ఐఎంఈ నంబరు ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే సొంతూరు కొవ్వూరు చేరుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.7 కోట్ల విలువైన వజ్రాలను కొట్టేసిన ఆ వ్యక్తి.. రెండు వేల రూపాయల ఫోన్ ను కొనేందుకు కూడా బాధితురాలి డెబిట్ కార్డును వినియోగించాడు. అలా సెల్ ఫోన్ కొనే విషయంలో కూడా శ్రీనివాస్ కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.