గత కొంత కాలంగా దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ మహిళ ప్రేమలో పడిపోయిన వ్యక్తిని కేవలం మూడు రోజుల్లోనే హతమార్చింది. అంతేకాదు ఈ దారుణ ఘటనను వీడియో కూడా తీసింది. కర్ణాటకలోని కలబురగిలో గతనెల 24న జరిగింది. వివరాల్లోకి వెళితే..
దయానంద లదంతి అనే వ్యక్తి దుబాయ్ లో పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన తన సొంత ఊరికి వచ్చాడు. ఇక్కడ పనులు పూర్తి చేసుకున్న దయానంద తిరిగి దుబాయ్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అంతలోనే అతనికి అంబిక అనే మహిళ ఫోన్ చేసింది. ఫోన్ లో అతనిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో మనోడు ఆమె మాయలో పడిపోయాడు. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ప్రేమలో పడి లోకాన్ని మరచిపోయాడు. ఇలా దయానందతో అంబిక మత్తు మత్తుగా మాట్లాడుతూ.. ఒకరోజు కలవాలని చెప్పింది. తన ఇంటికి రమ్మని పిలిచింది. ఆమె పన్నిన పన్నాగం ఏమాత్రం తెలియకుండా దయానంద వెళ్లాడు.
అంబిక వేసిన ఉచ్చులో తెలియక పడిపోయాడు దయానంద. ముందుగా ప్లాన్ ప్రకారం దయానంద్ను స్కూటీపై ఎక్కించుకుని నిర్మానుశ్య ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అప్పటికే ఆమె ఏర్పాటు చేసిన మరో నలుగురు గుండాలు అక్కడ మాటు వేసి ఉన్నారు. దయానందపై ఒక్కసారే కత్తులతో విరుచుకుపడ్డారు. అతనిని చంపుతుంటే.. అంబిక స్వయంగా వీడియో తీసింది. కానీ చట్టం ఎవరినీ వదిలిపెట్టదు.. అంబిక నేరం బయటపడింది. ఇదంతా తన ప్రియుడి కోసం చేసినట్లు ఒప్పుకుంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అంబికకు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు ఫేస్ బుక్ ద్వారా దయానంద్ వరసకు సోదరుడైన అనీల్ పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల అనీల్, దయానందకు మద్య ఆస్తి తగాదాలు రావడంతో దయానంద్ ని అంబిక ద్వారా చంపించాలని అనీల్ ప్లాన్ వేశాడు. అతని హత్యకుగాను ఆమెకు రూ.3 లక్షల సుపారీ కూడా ఇచ్చాడు. ప్రధాన నింధితుడితో పాటు అంబికను మరో ఆరుగురు నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు.