ఆశ మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుంది. ఎంతటి రిస్క్ చేయడానికైనా ప్రేరేపిస్తుంది. ఇలా ఆశపడే ఇప్పుడు మన సినీ తారల్లో కొందరు నిండా మునిగినట్టు టాక్ వినిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్ల మోసపోయినట్టు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ ని సైతం చిన్న ఆలోచనతో బురిడీ కొట్టించిన ఆ కిలాడీ లేడీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శిల్పా చౌదరి.. ఈమె సినీ ప్రేక్షకులకి అస్సలు తెలియదు. కానీ.., మన సినీ స్టార్స్ కి మాత్రం బాగా సుపరిచితమే. నిత్యం స్టార్స్ కి పార్టీ ఇస్తూ, వారితోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటుంది శిల్ప. ఒక్క సినీ తారలు మాత్రమే కాదు, ఈమె పార్టీలకి సంఘంలోని చాలా పెద్ద మనుషులు అటెండ్ అవుతూ ఉంటారు. శిల్ప అందరితోనూ పరిచయాలు పెంచుకుంటుంది. ఆ తరువాత అధిక వడ్డీ ఆశ చూపి వారి నుండి కోట్ల రూపాయలు వడ్డీగా తీసుకుంటుంది. ఆ తర్వాత నిండా ముంచేస్తుంది. ఇదే ఆమె వృత్తి, ప్రవృత్తి కూడా.
శిల్పా చౌదరి లైఫ్ స్టయిల్ చూస్తే చాలా రిజ్ గా ఉంటుంది. ఆమె ఇచ్చే పార్టీలు అదే రేంజ్ లో ఉంటాయి. ఆమె మాటకాలు అంతకన్నా తియ్యగా ఉంటాయి. దీంతో.. సినీ తారల నుండి బిగ్ షాట్స్ వరకు చాలా మంది ఈమెని గుడ్డిగా నమ్మేశారు. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. ఇప్పుడు వారికి అసలు లేదు. వడ్డీ లేదు.
తాజాగా ఈ కిలేడీపై నార్సింగి పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈమె బాధితుల నుంచి కోట్లాది రూపాయల వసూలు చేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. శిల్పా గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. మరి.., ఈ కిలాడీ లేడీ ఇంతమందిని మోసం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
