ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. తీవ్రమైన శిక్షలు విధించిన సమాజంలో నేర ప్రవృత్తి మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ప్రతి నిమిషం ఎక్కడో ఓ చోట మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు. వావివరసలు మరిచి.. వయసుతో కూడా సంబంధం లేకుండా పశువుల్లా ప్రవర్తించే మృగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పసి పిల్లలను కూడా వదలడం లేదు కామాంధులు. జరుగుతున్న దారుణాలు చూసి.. ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానులా పుట్టినా బాగుండు అనిపిస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనను మరువక ముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి రెండు రోజుల పాటు రాక్షసక్రీడ కొనసాగించారు కామాంధులు. ఆ వివరాలు..
పాతబస్తీలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఓయో రూమ్‌కు తీసుకెళ్లి.. రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. రెండు రోజుల క్రితం రబీష్, నిమాయత్‌తో పాటు మరో యువకుడు బాలికను కిడ్నాప్ చేసినఆమెకు మత్తుమందు ఇచ్చి ఓయో రూమ్‌కు తీసుకెళ్లారు. అనంతరంపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. రెండు రోజుల తర్వాత బాలికను ఓయో రూమ్‌లోనే వదిలి వెళ్లిపోయారు. అక్కడ నుంచి అతి కష్టం మీద బయటపడిన బాలిక జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది.
కుమార్తెపై జరిగిన దారుణం గురించి తెలుసుకున్న వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రబీష్, నిమాయత్ లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.