సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆకస్మాత్తుగా సంబవించే ప్రమాదాలు ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి. మానవ తప్పిదాల కారణంగానో లేక సహజంగానో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అగ్ని ప్రమాదాల వల్ల ధన, ప్రాణ నష్టాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్రిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అప్రమత్తతతో వ్యవహరించి చైన్ లాగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కాగా తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. భయాందోళనకు గురై జనం పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాలికా బజార్ లోని ఓ బట్టల దుకాణంలో ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. సికింద్రాబాద్ లో లష్కర్ బోనాల వేడుకలు జరుగుతుండడంతో ఆ ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రద్దీగా ఉంది. ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.
షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. విద్యుదాఘాతం ద్వారానే ప్రమాదం జరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సంబందిత అధికారులు. అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన విషయాలపై, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు చర్యల్లో బాగంగా ప్రమాద స్థలానికి చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, భవనాల్లో ఉన్నావారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.