పరాయి వ్యక్తుల మాయ మాటలకు లొంగిపోయి.. వారికి శారీరకంగా దగ్గరయ్యి.. భాగస్వామి అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాసలీలలకు అడ్డంగా ఉన్నారని లేదా తమ గుట్టురట్టయ్యిందన్న కారణంగా భర్తను లేదా భార్యను కడతేరుస్తున్నారు.
మూడు ముళ్లు, ఆరు అడుగులు, అగ్ని సాక్షిగా చేసుకుంటున్న ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు భార్యా భర్తలు. భాగస్వామిని కాదని మరొకరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నారు. పరాయి వ్యక్తుల మాయ మాటలకు లొంగిపోయి.. వారికి శారీరకంగా దగ్గరయ్యి.. భాగస్వామి అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాసలీలలకు అడ్డంగా ఉన్నారని లేదా తమ గుట్టురట్టయ్యిందన్న కారణంగా భర్తను లేదా భార్యను కడతేరుస్తున్నారు. ఇటీవల కాలంలో విచ్చలవిడితనంగా చేస్తున్న ఇటువంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఆర్ఎన్ఆర్ నగర్‌కు చెందిన బట్టు వెంకన్న, స్వప్న భార్యాభర్తలు. వెంకన్న తాగి భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఆటో డ్రైవర్ లావుడ్య ప్రశాంత్‌తో స్పప్నకు పరిచయం ఏర్పడి.. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం కాలనీవాసుల ద్వారా భర్త వెంకన్నకు తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్తకు తమ విషయం తెలిసిందని.. తెలుసుకున్న ప్రియుడు ప్రశాంత్.. ఆమెతో కలిసి అతడ్ని హత్య చేసేందుకు పన్నాగం పన్నారు.
ఏప్రిల్‌లో తాగి వచ్చిన భర్త ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అన్నం తిని పడుకోగా.. తమ ప్రణాళికలను అమలు చేశారు ఇద్దరు. భర్త నిద్రపోయాక ప్రియుడికి ఫోన్ చేసింది స్వప్న. గొంతు నులిమి చంపేయాలని సలహా ఇవ్వడంతో ఆ విధంగా చేసింది. అయితే వెంకన్న మృతిపై తమ్ముడు లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం పంపగా.. అందులో గొంతు నులుమడంతో చనిపోయినట్లు తేలింది. అప్పటి నుండి స్వప్న పరారీలో ఉండటంతో.. ప్రత్యేక బృందాన్నిఏర్పాటు చేసి ఆమెతో పాటు ప్రశాంత్‌లను ఏనుమాములో పట్టుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.