మద్యానికి బానిసైన భర్త.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పెళ్లాం, పిల్లల గురించి పూర్తిగా మర్చిపోతున్నాడు. అందిన కాడికి అప్పులు చేస్తూ.. తాగుతూ.. ఇల్లు గుళ్ల చేస్తాడు. తాగి వాగుతూ ఉన్న కాస్త పరువు కూడా బజారున పడేస్తుంటారు. ఈ తాగుడు మూలంగా అనేక జీవితాలు నాశనమౌతున్నాయి.
మద్యం ఎంతటి అనార్థమైనా తెచ్చి పెడుతోంది. పీకల దాకా తాగొచ్చి భార్యపై ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడుతుంటాడు భర్త. అనవసరంగా చేయి చేసుకుంటాడు. తనకే సమస్యలు, చిరాకు, బాధ్యతలు ఉన్నట్లు ఊహించుకుని, భారమంతా తనమీదే పడిందన్న ఆందోళనలో మద్యానికి బానిసవుతున్నాడు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పెళ్లాం, పిల్లల గురించి పూర్తిగా మర్చిపోతున్నాడు. అందిన కాడికి అప్పులు చేస్తూ.. తాగుతూ.. ఇల్లు గుళ్ల చేస్తాడు. తాగి వాగుతూ ఉన్న కాస్త పరువు కూడా బజారున పడేస్తుంటారు. ఈ తాగుడు మూలంగా అనేక జీవితాలు నాశనమౌతున్నాయి. తాగొద్దు అని చెప్పినందుకు భార్యను కడతేర్చాడో కసాయి భర్త.
పెద్దలు ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఆ బంధంలో మద్యం పెను చిచ్చును పెట్టింది. మద్యం తాగొద్దు అన్నందుకు భార్యను కిరాతకంగా చంపాడు భర్త. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో జరిగింది. షాద్ నగర్‌లో నివాసం ఉంటున్నారు యాదయ్య, కవిత. 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవపడేవాడు. అయితే వీరి మధ్య ఏర్పడ్డ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ సర్ధి చెప్పారు పెద్దలు. అయితే మరోసారి మద్యం సేవించి రాగా, తాగొద్దని కవిత వారించింది. దీంతో కోపంతో ఊగిపోయిన యాదయ్య.. ఆమె నిద్ర పోయిన తర్వాత.. కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని చెప్పసాగాడు. అయితే కవిత బంధువులు మాత్రం అతడే చంపేశాడని చెబుతున్నారు.