ఫోనులో మిస్డ్ కాల్, తెలియని నంబర్లకు మేసేజ్ వెళ్లడం ద్వారా చాలా మంది ముక్కు మొహం తెలియని చాలా మంది పరిచయస్థులుగా మారారు. ఇప్పుడు ఇదే మిస్ట్ కాల్ ఓ హత్యకు దారి తీసింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని పెద్ద అంబర్ పేటలో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటనలో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి.
ఫోనులో మిస్డ్ కాల్, తెలియని నంబర్లకు మేసేజ్ వెళ్లడం ద్వారా చాలా మంది పరిచయస్థులు అయ్యారు. ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే అనర్ధాలకు దారి తీసిన సంఘటనలు ఉన్నాయి. వయస్సు, జాతితో సంబంధాలు లేకుండా పరిచయాలు జరిగాయి. ఫేస్ బుక్, వాట్సప్, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా మోసపోయిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఇదే మిస్ట్ కాల్ ఓ హత్యకు దారి తీసింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని పెద్ద అంబర్ పేటలో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటనలో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పెద్ద అంబర్ పేట్ డాక్టర్స్ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత కేసు దర్యాప్త చేపట్టిన పోలీసులు తొలుత వివాహేతర సంబంధం కారణమని భావించగా.. ఆ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
అతడు, ఆమె, మధ్యలో మరో వ్యక్తి.. ఓ మిస్ట్ కాల్ వీరి జీవితాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్‌లోని హయాత్ నగర్‌లో నివాసముంటున్నారు నాగేశ్వరరావు, సుజాత భార్యా భర్తలు. సుజాత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో 45 ఏళ్ల సుజాత చేసిన ఓ మిస్ట్ కాల్ .. 25 ఏళ్ల రాజేష్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత తరచూ వాట్సప్ సందేశాలు మొదలయ్యాయి. సుజాత డీపీని చూసి ఆమెకు పెళ్లి కాలేదని భావించిన రాజేష్.. ఫోన్ మాట్లాడుకోవడం మొదలు పెట్టాడు. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత సుజాతకు పెళ్లి అయిన విషయం తెలిసింది. తనను మోసం చేసిందని తెలుసుకుని, దూరం పెట్టసాగాడు రాజేష్. దీంతో మనస్థాపానికి గురైన సుజాత.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఆసుపత్రిలో ఉన్న విషయం తెలియక రాజేశ్ ఆమె సెల్‌ఫోన్‌కు వాట్సప్ సందేశాలు, కాల్స్ చేశాడు. పదే పదే రాజేశ్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేసి అతడికి వార్నింగ్ ఇచ్చారు. నేరుగా కూడా హెచ్చరించారు. ఆ తర్వాత సుజాత పరిస్థితి మరింత విషమంగా మారి చనిపోయింది. అయితే రాజేష్ కూడా ఆ తర్వాత చనిపోయి కనిపించాడు. వివాహేతర సంబంధం కారణంగా సుజాత భర్త నాగేశ్వరరావు అతడిని చంపి ఉంటాడని భావించిన పోలీసులు.. అతడ్ని విచారించగా.. తనకేమీ తెలియదని చెప్పడంతో.. విచారణ వేగవంతం చేశారు. చివరకు ప్రాణ భయంతో రాజేష్ కూడా తన పర్ాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన హత్య కేసు నుండి సూసైడ్ కేసుగా మలుపు తీసుకుంది. ఒకే ఒక్క మిస్ట్ కాల్ ఇద్దరు జీవితాలను బలితీసుకుంది.