హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ రౌడీ కిరాతకానికి పాల్పడ్డాడు. అమాయక యువకుడిని నగ్నంగా ఓ గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? గదిలో బంధించిన ఆ యువకుడి పట్ల రౌడీ ఎలా ప్రవర్తించాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన అలీ, సాలం స్నేహితులు. అయితే ఇటీవల అలీ సాలంను పిలిస్తే రాలేదు. దీంతో అలీ అప్పటి నుంచి సాలంపై కోపంతో ఊగిపోయాడు. ఇక ఎలాగైన అలీ సలాంపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే అలీ తన స్నేహితుడు అయిన సాలంను ఇటీవల తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ యువకుడు వచ్చిన అనంతరం అలీ ఫుల్ గా మద్యం సేవించాడు. ఆ తర్వాత అలీ సాలంను కత్తితో బెదిరించి ఒంటిపై బట్టలు మొత్తం తీయమన్నాడు. భయంతో ఊగిపోయిన సాలం బట్టలు విప్పాడు.
ఆ తర్వాత అలీ సాలంను నగ్నంగా డ్యాన్స్ చేయాలని కోరాడు. చేయకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఏం చేయలేని నిస్సాహాయ స్థితిలో సాలం భయంతో అలీ చెప్పినట్లే చేశాడు. ఇదంతా అక్కడున్న మరికొంత మంది వీడియోలు తీసుకుని ఆనందించారు. అనంతరం ఈ ఘటనపై బాధితుడు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రౌడీ అలీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. మద్యం మత్తులో బరితెగించిన ప్రవర్తించిన ఈ రౌడీ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
పాతబస్తీలో రెచ్చిపోయిన రౌడీ! ఓ యువకుడితో నగ్నంగా! pic.twitter.com/zGScNjboQC
— Sekhar Rambo (@RamboSekhar) January 23, 2023