అది శనివారం ఉదయం 11 గంటల సమయం. ఓ 20 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇక ఇంట్లో ఆ యువతి తన పని తాను చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉంది. ఈ క్రమంలోనే కాపుకాసిన ఓ దుండగుడు పట్టపగలు ఆ యువతి ఇంట్లోకి దూరిపోయాడు. ఓంటరిగా ఉన్న ఆ యువతిపై ఆ దుండగుడు చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి సైలెంట్ గా చెక్కేశాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? యువతికి ఆ యువకుడికి ఏంటి సంబంధం అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ యువతికి గతంలో జాష్‌పూర్ జిల్లాకు చెందిన షాబాజ్ ఖాన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వృత్తిరిత్యా ఇతడు కండక్టర్. మాటలతో మొదలైన వీరి పరిచయం చివరికి ప్రేమించుకునే దాక వెళ్లింది. అలా వీరి ప్రేమాయణం 3 ఏళ్లదాక సాగింది. రోజూ ఫోన్ లో మాట్లాడుతుండడమే కాకుండా అప్పుడప్పుడు బయట కలుసుకునేవారట. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఆ యువతి అతనితో మాట్లాడడం మానేసి మరో యువకుడితో మాటలు కలిపినట్లు సమాచారం. కానీ.. ప్రియుడు షాబాజ్ ఖాన్ ప్రియురాలితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ యువతి మాత్రం అతనితో మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇక ప్రేమించిన యువతి ఇలా చేయడంతో షాబాజ్ ఖాన్ తట్టుకోలేకపోయాడు. పట్టరాని కోపంతో ఊగిపోయిన షాబాజ్ ఖాన్ ఎలాగైన తన ప్రియురాలిని హత్య చేయాలని అనుకున్నాడు.
ఇక ఇందులో భాగంగానే షాబాజ్ ఖాన్ డిసెంబర్ 24న విమానంలో అహ్మదాబాద్ నుంచి రాయ్ పూర్ కు చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆ యువకుడు బస్సులో ప్రియురాలు ఇంటికి చేరుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో ఆ ఇంట్లో ఆ యువతి తప్పా మరెరూ లేరని తెలుసుకున్నాడు. ఇక పక్కా ప్లాన్ తో షాబాజ్ ఖాన్ ప్రియురాలు ఇంట్లోకి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూనే తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో ప్రియురాలిని దారుణంగా పొడిచి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న ఆ దుండగుడు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడు.
ఒక గంట తర్వాత ఆ యువతి సోదరుడు ఇంట్లోకి వచ్చి చూడగా.., యువతి రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఆ సీన్ ను చూసిన ఆ యువకుడికి మాటలు రాలేదు. అనంతరం ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చేరవేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఆ యువతి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.