ఈ రోజుల్లో ప్రేమ కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. ప్రేమించిన యువతి దక్కకపోతే చావడానికైన సిద్దపడతారు. సరిగ్గా ఇలాగే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ యువకుడు.., పెళ్లైన మహిళ ప్రేమకు నిరాకరించిందనే కారణంతో గొంతు కోసుకున్నాడు. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ నాయక్ అనే యువకుడు అనంతపురం రూరల్ పరిధిలోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన బాలాజీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలైన ఓ మహిళను ప్రేమించాలని గత కొన్నేళ్ల నుంచి వెంటపడుతున్నాడు. మరో విషయం ఏంటంటే? ఆ మహిళకు గత నాలుగేళ్ల కిందటే వివాహం జరిగి పాపంపేటలో భర్తతో పాటు అత్తింట్లో ఉంటుంది. పెళ్లైన కూడా వదలని మన వీర ప్రేమికుడు బాలాజీ తరుచు ఆ మహిళను వేధిస్తునే ఉండేవాడు.
బాలాజీ వేధింపులను భరించలేని ఆ వివాహత నాకు పెళ్లైందని, వేధించడం మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చి గత రెండు నెలల నుంచి అతనితో పూర్తిగా మాట్లాడడమే మానేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలాజీ నాయక్ శుక్రవారం పాపంపేటకు చేరుకుని భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే ఆ మహిళ ఇంట్లోకి దూరిపోయాడు. నన్ను ప్రేమించాలని, లేకుంటే గొంతు కోసుకుంటానని బెదిరించాడు. అయినా సరే నన్ను వేధించకు అని ఆ మహిళ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇక మనస్థాపానికి గురైన బాలాజీ నాయక్ ఆమె ఇంట్లో ఉన్న కత్తితో తన గొంతు కోసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలాజీ సోదరులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పెళ్లైన మహిళను ప్రేమించాలని వెంటపడుతున్న బాలాజీ నాయక్ మీ తమ్ముడే అయితే అతనికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.