మీరు ఎదగాలని అనుకుంటున్నారా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేదా? ఇంకా ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అవకాశం. ఉద్యోగం చేస్తూ కూడా మీరు వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది.
మీరు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? అది కూడా రిస్క్ ఉండకూడదు అని అనుకుంటున్నారా? డిమాండ్ ఉన్న బిజినెస్ అయితే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. ప్రభుత్వమే ఈ బిజినెస్ ని సపోర్ట్ చేస్తుంది. అంతెందుకు ప్రభుత్వమే ఈ బిజినెస్ కోసం స్థలం కేటాయిస్తుందంటే అర్థం చేసుకోండి. ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉందో. ఆ వ్యాపారం పేరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ప్రస్తుతం విద్యుత్ వాహనాలను ఎక్కువ మంది కొనడం లేదు. దీనికి కారణం ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం. లోకల్ లో తిరగడానికి అంటే పర్లేదు గానీ మరీ హైదరాబాద్ దాటి వెళ్లే వారే ఈవీలు కొనడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. పోనీ రిస్క్ చేసి ఛార్జింగ్ స్టేషన్లు పెడితే.. అందుకు తగ్గట్టు వాహనాలు అమ్మితేనే కదా లాభాలు ఉండేది. దీంతో ఎటూ తేల్చుకోలేక ఆయా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు డైలమాలో పడ్డాయి.
ఈ క్రమంలో ముందుగా ప్రభుత్వ భూములను ఎంపిక చేసి పీపీపీ విధానంలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో 3 వేలకు పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం హైదరాబాద్ లోనే కాకుండా బయట ప్రాంతాల్లో 453 ప్రాంతాలను గుర్తించింది. ఇవన్నీ ప్రభుత్వ శాఖలకు చెందినవి. వీటిలో 41 చోట్ల స్థలాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకుంది. ఈ 453 ప్రాంతాల్లో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు గానీ, ఏవైనా ప్రైవేటు సంస్థలు గానీ నేరుగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. ఒక్కో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కు రూ. 25 లక్షల పెట్టుబడి అవుతుంది.
ఆదాయం ఎలా వస్తుంది? దీని వల్ల ప్రభుత్వానికి లాభం ఏంటి? అనేగా ఆలోచిస్తున్నారు. మీ ఈవీ స్టేషన్ కి ఒక కారు వచ్చిందనుకోండి. ఒక్కో ఈవీ కారుకి ఛార్జింగ్ పెడితే 20 నుంచి 70 యూనిట్ల వరకూ విద్యుత్ అనేది ఖర్చవుతుంది. ఉదాహరణకు ఒక కారుకు ఛార్జింగ్ పెట్టడానికి 30 యూనిట్ల విద్యుత్ అవసరం అనుకుంటే.. ఒక్కో యూనిట్ కి రూ. 20 చొప్పున ఛార్జింగ్ రుసుము వసూలు చేయవచ్చు. అంటే ఒక కారుకి ఛార్జింగ్ పెట్టినందుకు 30 యూనిట్లకు రూ. 600 ఛార్జ్ చేస్తారు. ఇందులో రెడ్కోకి యూనిట్ కి రూపాయిన్నర చొప్పున 30 యూనిట్లకు రూ. 45 చెల్లిస్తారు. మీకు ఇందులో రూ. 555 మిగులుతాయి. ఇలా రోజుకు ఎన్ని కార్లకు ఛార్జింగ్ పెడితే అన్ని 555 రూపాయలు వసూలు చేయవచ్చు.
యావరేజ్ గా ఒక కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడానికి గంట పడుతుంది. 24 గంటలు సర్వీస్ చేస్తే గనుక రోజుకు రూ. 13,320 సంపాదించుకోవచ్చు. అంటే నెలకు రూ. 4 లక్షలు వస్తాయి. 12 గంటలు మాత్రమే సర్వీస్ చేస్తే రోజుకు రూ. 6,660 సంపాదించుకోవచ్చు. నెలకు రూ. 2 లక్షల వరకూ వస్తుంది. ఇందులో జీతాలకు, ఇతర మెయింటెనెన్స్ లకు అన్నీ తీసేసినా కనీసం లక్ష అయినా మిగులుతుంది. ఈ వ్యాపారం కోసం మీరు స్థలం కోసం డబ్బులు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే స్థలం చూపిస్తుంది. కిరాయిగా యూనిట్ కి రూపాయిన్నర చొప్పున మీ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. కాబట్టి రెంట్ గొడవ లేదు.
ఇక వ్యాపారానికి పెట్టుబడి కోసం బ్యాంకులు ఉండనే ఉన్నాయి. ఈ వ్యాపారానికి రూ. 25 లక్షలు ఖర్చు అవుతుంది. మీ దగ్గర రూ. 25 లక్షలు ఉంటే రూ. 2 వడ్డీకి తిప్పుకుంటే లక్షకు రూ. 2 వేల చొప్పున రూ. 50 వేలు వస్తాయి. అదే ఈ వ్యాపారం చేస్తే కనీసం తక్కువలో తక్కువ రూ. లక్ష అయినా వస్తుంది. బ్యాంకు వడ్డీ తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఈ వ్యాపారం చేస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. మీరు ఉద్యోగం చేస్తూ కూడా నెలకు లక్షలు సంపాదించుకోవచ్చు. మరి స్థలం ప్రభుత్వమే ఇచ్చి.. బిజినెస్ ఐడియా కూడా ప్రభుత్వమే ఇచ్చి.. మీకు లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.