బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆదివారం ఎంతో అట్టహాసంగా ఈ బుల్లితెర రియాలిటీ షో స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఒకేసారి హౌస్‌లోకి 21 మంది సభ్యులను పంపి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ సీజన్‌లో సభ్యులను కూడా చాలా భిన్నంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. నాగార్జున తనదైనశైలిలో సీజన్‌ని స్టార్ట్ చేశాడు. ఇంట్లోకి వెళ్లకముందే స్టేజ్‌పైనే అందరిపై పంచులు వేసి పంపాడు. హౌస్‌లో సభ్యులు ఇప్పుడే ఉండటానికి అలవాటు పడుతున్నారు. ఈ సీజన్లో ఇద్దరు మాత్రం బాగా ఆకట్టుకుంటున్నారు. ఒకరు సింగర్ రేవంత్, రెండు బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి. రేవంత్ అంటే తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మరోవైపు ఇన్నాళ్లు రివ్యూ చేసిన ఆదిరెడ్డి హౌస్‌లో ఎలా ఉంటాడు అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా మొదటిరోజే కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. అదికూడా సింగర్ రేవంత్– ఆదిరెడ్డి మధ్య. ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఆదిరెడ్డిని చూసి రేవంత్.. నువ్వు ఏం పని చేయవా? వెకేషన్‌కి వచ్చినట్లు ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు. అందుకు ఆదిరెడ్డి రేపటి నుంచి చేస్తాను బ్రో అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. అయితే అక్కడే రేవంత్‌పై ఆదిరెడ్డికి ఒక ఒపీనియన్ ఏర్పడింది. అదే విషయాన్ని అర్జున్ కల్యాణ్‌తో మాట్లాడుతూ ఆదిరెడ్డి ప్రస్తావించాడు. తనకి మొదటిరోజే రేవంత్, ఫైమా, చంటిలపై స్ట్రాంగ్ ఒపీనియన్ బిల్డ్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఫైమాని అంతా తక్కువ అంచనా వేస్తున్నారని.. ఆమె చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని వెల్లడించాడు. అయితే రేవంత్ విషయంలో మాత్రం ఆదిరెడ్డి నెగెటివ్‌గానే స్పందించాడు.
“రేవంత్ బాగా ఓవర్ రియాక్టివ్‌గా అనిపిస్తోంది. మనకు సంబంధం లేని విషాల్లోనూ ఇంటర్‌ఫియర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అది అందరికీ నచ్చదు. ప్రతి విషయానికి ఓవర్ రియాక్టివ్ అవుతున్నాడు. యాక్టివ్‌గా ఉండాలి.. యాక్టివ్‌గా రియాక్ట్ అవ్వాలి అనుకుంటూ ఇలా చేస్తున్నాడు అనుకుంట. ఇంట్లో ఎవరో ఒకళ్లు రియాక్ట్ అవుతూ ఉండాలి కదా అనే ఉద్దేశంతో చేస్తున్నట్లు ఉంది” అంటూ ఆదిరెడ్డి తన ఒపీనియన్‌ని వెల్లడించాడు. అయితే బిగ్ బాస్ ఏమీ మ్యాథ్స్ ప్రాబ్ల కాదని అందరికీ ఒకే ఆన్సర్ రావడానికి అంటూ కామెంట్ చేశాడు. ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలని లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ముందు ముందు ఆదిరెడ్డి ఇలాగే ఓపెన్ కామెంట్స్ చేస్తే శత్రువులు గట్టిగానే పుట్టుకొస్తారనే విషయం అర్థమైపోతోంది.