బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి వెళ్లిన అందగత్తెల్లో వాసంతి ఒకరు. చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న వాసంతి బిగ్ బాస్ హౌస్ తో తనదైన ఆటను చూపించింది. బిగ్ బాస్ సీజన్-6 గ్లామర్ డాల్ పేరు తెచ్చుకున్న బ్యూటీ.. ఈ షోలోకి పాల్గొన్నక ముందు వరకు చాలా మంది ప్రేక్షకులకు అంతగా పరిచయంలేదు. అయితే బిగ్ బాస్ షో అనంతరం ఈ అమ్మడికి అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హౌస్ లో ఆట కంటే తన అందంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. అలా తన అందంతోనే కొన్ని వారాలపాటు హౌస్ లో నిలబడింది. గత ఆదివారం వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ లోకి వెళ్లేటప్పుడు ఎంత పాజిటీవ్ ఎనర్జీతో వెళ్లిందో బయటకు వచ్చే సమయంలోనూ అంతే జోష్ తో వచ్చింది. అనంతరం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి.. బిగ్ బాస్ హౌసకు సంబంధించిన పుల ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
బిగ్ బాస్ వెళ్లే వరకు చాలా మంది ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఆ రియాల్టీ షోలో పాల్గొనడంతో చాలా మంది ఫేమస్ అవుతుంటారు. గతంలో సీరియల్స్, యూట్యూబ్ ఛానల్స్, షార్ట్ ఫిల్మ్ వంటి వాటిలో రాణిస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ షోలోకి వెళ్లడం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై.. పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ ఒకరు. సీరియల్ నటి అయిన ఈ ముద్దుగుమ్మ చాలా మందికి సరిగ్గా తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఆర్తీ అగర్వాల్ లాగా ఉందంటూ కొందరు అభిప్రాయపడ్డారు. చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న వాసంతి.. తనదైన ఆటతో బిగ్ బాస్ హౌస్ లో కొన్ని వారాల పాటు గట్టిపోటీ ఇచ్చింది. ఇక హౌస్ లో 70రోజులు ఉన్న వాసంతి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాసంతి మాట్లాడుతూ..”బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని అనుకున్నా కానీ అలా జరగలేదు. అయితే అక్కడి పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో మాకు ఒక అంచనా ఉండేది దాంతో కాస్త రిలాక్స్ అయ్యేవాళ్ళము. కానీ ఎప్పుడైతే సూర్య, గీతూ ఎలిమినేట్ అయ్యారో మాకు టెన్షన్ మొదలైంది. మా అంచనాలు తలకిందులు చేస్తూ ఎలిమినేషన్ జరిగింది. దాంతో ఎప్పుడు ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియక టెన్షన్ పడేవాళ్ళము. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక 6 కేజీలు తగ్గాను. అక్కడ అందరికీ సరిపడినంత ఫుడ్ ఉంటుంది. కానీ ఒత్తిడి కారణంగా తిన్నది సరిగ్గా ఒంటబట్టదు. దీంతో షోలోకి వచ్చిన చాలామంది గతంలో కంటే బరువు తగ్గుతారు.” అని చెప్పుకొచ్చింది.