ఆడపిల్ల పుట్టిందంటే చాలు కొంతమంది కోపంతో ఆ పసిబిడ్డను చంపటం లేదంటే ఇతరులకు అమ్మడం చేస్తూంటారు. ఇక అంతరిక్షపు అంచులను కూడా తాకేస్థాయికి చేరుకుని అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా తమ ప్రతిభను చూపిస్తున్నారు ఆడవాళ్లు. అలాంటి ఈ పోటీ యుగంలో కూడా నేటికి ఇంకా ఆడపిల్ల పట్టడమే పాపమవుతోంది. తాజాగా ఏపీలో ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భర్తతో పాటు అత్తింటివారు సైతం ఆ కోడలికి బతికుండగానే నరకం చూపిస్తున్నారు.
అసలు ఇంతటి అమానుష ఘటన ఎక్కడ జరిగింది? అత్తింటి కుటుంబం ఎలా ప్రవర్తిస్తున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడుకు గ్రామం. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు నాగాంజలి-వెంకటేశ్వర రావు అనే భార్యాభర్తలు. రెండేళ్లక్రితం ఈ దంపతులకు ఓ ఆడపిల్ల జన్మించింది. భర్త వెంకటేశ్వరరావుకి మనసులో మాత్రం మగబిడ్డ కావాలని కోరిక బలంగా నాటుకుపోయింది.
కూతురు జన్మించడంతో గత రెండేళ్ల నుంచి నాగాంజలి పుట్టింట్లోనే ఉంటూ ఉంది. ఇన్ని రోజులు గడుస్తున్న భర్త ఏనాడు భార్య దగ్గరకు రాకపోవడం, కూతురుని చూడకపోవడాన్ని భార్య నాగాంజలి తట్టుకోలేకపోయింది. దీంతో అప్పటి నుంచి కోడలిని భర్తతో పాటు అత్తింటివారు తీవ్ర మానసికంగా వేధించేవారు. ఇక ఇలా కాదని భావించిన నాగాంజలి ఓ రోజు తన కూతురుని తీసుకుని అత్తింటికి వెళ్లిపోయింది. కోడలి రాకను గమనించిన అత్తామామలు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు.
వీరి నిర్ణయంతో షాక్ కు గురైన నాగాంజలి తమకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మౌనధీక్షకు దిగింది. న్యాయం చేసి భర్తతో కలపాలని నాగాంజలి తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. చూశారుగా ఓ ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే భర్తతో పాటు అత్తింటివారి ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారో. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.