శ్వేత మరణానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్వేత తల్లి.. మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో తాజాగా మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
విశాఖ సాగర తీరంలో అర్ధనగ్నంగా శవమై కనిపించిన వివాహిత శ్వేత మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగళవారం సాయంత్రం కనిపించకుండా పోయిన శ్వేత.. విశాఖ బీచ్ లో ఇసుక మధ్య అర్ధనగ్నంగా శవమై కనిపించింది. దీనిని గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు ఆధారాలను పోలీసు సేకరించారు. ఇక శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చేరింది. శ్వేత అత్తింటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పర్చేందుకు సిద్ధమయ్యారు.
శ్వేత మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నీటిలో మునిగి శ్వేత చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అలానే శ్వేత మరణానికి గల కారణాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు, శ్వేత సెల్‌ఫోన్ ఈ కేసులో కీలకంగా మారాయి. పోలీసులు ఇప్పటికే మృతురాలి భర్త మణికంఠతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అలానే శ్వేత తల్లి మణికంఠ చెల్లెలి భర్తపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మణికంఠ చెల్లెలి భర్త తన కూతుర్ని లైంగికంగా ఇబ్బంది పెట్టాడని శ్వేత తల్లి ఆరోపిస్తోంది. తాజాగా శ్వేత భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు భర్త సత్యంలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నలుగురిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక కోర్టు వారి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వారు నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. శ్వేత భర్త మణికంఠ, అత్తమామలపై వరకట్న వేధింపుల కింద పోలీసులు నమోదు చేయగా.. ఆడపడుచు భర్త సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు శ్వేత మృతి కేసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ లెటర్ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి ఆర్కే బీట్ కు శ్వేత ఎలా వచ్చిందనే దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
సీసీ ఫుటేజీల ద్వారా ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక శ్వేత మరణానికి ముందు జరిగిందేంటంటే… మంగళవారం భర్తతో ఆమె గొడవపడి ఇంటినుంచి బయటకు వెళ్లింది. ఇక, అప్పటినుంచి కనిపించకుండాపోయింది. అత్తింటి వారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి బీచులో అర్ధ నగ్నంగా శ్వేత శవం దొరికింది. పోలీసులు ఈ సమాచారాన్ని శ్వేత అత్తింటి వారికి అందించారు. అయితే, అత్తింటి వారే తన కూతుర్ని చంపేశారని శ్వేత తల్లి ఆరోపిస్తోంది. మరి.. శ్వేత మరణం విషయంలో ఇరు కుటుంబాలు చేస్తున్న వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.