ఈ కాలం చాలా మంది యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. కొందరు యువత మనస్పర్ధలతో విడిపోతుంటారు. కానీ మరికొందరు మాత్రం పెద్దలను ఎదిరించి అయిన సరే పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. అలా ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని జంటలను పెద్దల విడదీయకున్నా.. దేవుడు విడదీస్తుంటాడు. తను ప్రేమించిన వ్యక్తి అనుకోని ఘటనలో దూరమైతే ఆ భాగస్వామి వేదన వర్ణణాతీతం. తాజాగా ఇద్దరు డ్యాన్సర్లు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లైయి ఏడాది తిరకుండానే రోడ్డు ప్రమాదంలో భార్య కళ్లేదుటే భర్త మరణించాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం జిల్లా అల్లిపురం ప్రాంతానికి చెందిన కె.వేణు(28), తిలోత్తమ డ్యాన్సర్లు. ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్లు వెళ్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. గత గతేడాది నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రణస్థలం మండలం జేఆర్‌పురంలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి నరసన్నపేటలో వీళ్లకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. ఈక్రమంలో డ్యాన్స్ ప్రోగ్రాంకు వెళ్లేందుకు రణస్థలం నుంచి స్కూటీపై దంపతులు బయలుదేరారు. లావేరు మండలం అదపాక జంక్షన్‌కు వచ్చేసరికి అదుపుతప్పి వీరి బైక్ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.
ఇదీ చదవండి: భార్య శవం పక్కన భర్త.. గదిలో ఇద్దరు అమ్మాయిలు..వేణు రహదారిపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన తిలోత్తమను 108లో రిమ్స్‌కు తరలించారు. లావేరు పోలీస్ స్టేషన్ హెచ్‌సీ జి.రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.