ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అలానే మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరక ప్రాయంగా గడపుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అలానే మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరక ప్రాయంగా గడపుతున్నారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై బస్సు తగలబడిపోయింది. అలానే నెలల క్రితం సికింద్రబాద్ లోని ఓ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఆరుగురు యువత ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పరిధిలోని నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టైల్స్ పరిశ్రమ ఆవరణలో ఓ ప్రాంతంలో గోనెసంచులు, చెత్త చెదారం, జీడి పిక్కల వ్యర్థాలు తదితర వస్తువులు నిల్వ ఉన్నాయి. ఆ వస్తువులు అగ్ని ప్రమాదానికి గురై మంటలు భారీగా ఎగసిపడ్డాయి. వెంటనే ఫ్యాక్టరీలోని అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. చాలా సమయం పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆ ప్రాంతంలో డంపింగ్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగసి పడ్డాయి. దీంతో ఆ పరిశ్రమ చుట్టుపక్కల భారీగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
పరిశ్రమ నుంచి భారీ ఎత్తున మంటలను రావడంతో పరిశ్రమలోని సిబ్బంది భయపడ్డారు. అలానే పరిశ్రమ నుంచి వెలువడిన మంటలను చూసిన చేబ్రోలు, నారాయణపురం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. వేసవి కాలంలో ఇలా తరచూ అగ్నిప్రమాదాలు జరగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి.. ఇలా వరుసగా అగ్నిప్రమాదాల ఘటనలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.