విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. కంచెరపాలెం సమీపంలో ఉన్న రైలులోని ఓ కోచ్ పై రాళ్లతో దాడి చేసినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది. అయితే ఎవరు దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? అనే అంశాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 19న విశాఖ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజలకు ఇలాంటి లగ్జరీ ట్రైన్స్ పనికి రావని, టాయిలెట్స్, ఫుట్ బోర్డుల్లో, పాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేందుకే ఇష్టపడతారంటూ కామెంట్ చేస్తున్నారు. దేశం పురోగతి సాధిస్తున్న తరుణంలో.. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్- విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. ఇది సికింద్రాబాద్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరంలో ఆగనుంది. ఇది మొత్తం 20 నిమిషాల పాటు ఆగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6 గంటలకు విశాఖకు చేరుకుంటుందని చెబుతున్నారు. అంటే మొత్తం 8 గంటలపాటు సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో హైదరాబాద్- వైజాగ్ మధ్య ప్రయాణ సమయం 4 గంటల మేర తగ్గనుంది. టికెట్ ధరలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన జరగలేదు.
Andhra Pradesh | Stones pelted on Vande Bharat train in Visakhapatnam which will be flagged off by PM Modi on Jan 19. Incident occurred during maintenance.
Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4
— ANI (@ANI) January 11, 2023