ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సొంత ఊరైన నీలకంఠాపురంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతున్నారు.
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఏళ్లుగా ప్రజా జీవితంలో గడిపారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ గా బాధ్యతలు చేపట్టారు. చుట్టూ కార్యకర్తలు, అభిమానులు సందడితో ఎప్పుడూ హడావుడిగా గడిపారు రఘువీరారెడ్డి. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సొంత ఊరైన నీలకంఠాపురంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి హంగూ.. అర్భాటాలకు పోకుండా సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా గడుపుతూ.. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన తన మనవరాలితో బోలు షీకారుకు సంబంధించిన ఫోటో షేర్ చేశారు.. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుతుంది. వివరాల్లోకి వెళితే..
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తన సొంతూరు అయిన నీలకంఠాపరంలో కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన సొంత ఊరిలో వందల ఏళ్లనాటి పురాతన ఆలయ పునరుద్దరణ చేసి అనుకున్నది సాధించారు. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేధికగా పలు ఆసక్తికర వీడియోలు, ఫోటోలతో అభిమానులను పలకరిస్తున్నారు. తాజాగా తన సొంత ఊరు నీలకాంఠాపురం చెరువులో మనవరాలితో కలసి తెప్పలో విహారం చేశారు.
తన మనవరాలు తెప్పలో కూర్చొని చేస్తున్న అల్లరి ఎంజాయ్ చేశారు రఘువీరా.. అలా కొంత సేపు జలవిహారం చేసిన తాతా మనవరాలు బయటకు వచ్చారు. అక్కడే రఘువీరా రెడ్డి తన మనవరాలితో హుషారుగా డ్యాన్స్ చేశారు. మొత్తానికి తన మనవాలితో చిన్నపిల్లాడిలా సంతోషంగా గడిపారు. రాజకీయంగా ఎంత చక్రం తిప్పినా మనవలు.. మనవరాళ్లు వచ్చాక వారి ముందు చిన్నపిల్లలా మారాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా పలుసార్లు తన మనవరాలితో రఘువీరా సంతోషంగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
With my granddaughter sailing on a coracle , at my village #Neelakantapuram pic.twitter.com/zSWPaqqoIg
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) February 22, 2023