ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మానవ తప్పిదాల వల్ల కొన్ని.. సాంకేతిక లోపాల వల్ల మరికొన్ని రైళ్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఇటీవల శబరి ఎక్స్ ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది.. కొంత మంది ఆకతాయిలు గుంటూరు స్టేషన్ వద్ద పట్టాలపై రాడ్డు పెట్టి ఉండటాన్ని లోకో పైలెట్ గుర్తించి అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మద్యనే షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు లో అగ్నిప్రమాదం జరిగింది.. అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇలా ఎక్కడో అక్కడ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గూడురు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు లో మంటల చెలరేగాయి.. వెంటనే రైల్వే సిబ్బంది అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
అహమ్మదాబాద్ నుండి చెన్నై కి వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ గూడూర్ జంక్షన్ వద్దకు రాగానే ఉన్నట్టుండి రైలులో ని పాన్ ట్రీ కార్ లో ఒక్కసారే మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా గూడూరు స్టేషన్ లో రైలు ని ఆపివేశారు. రైల్వే సిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.. అప్పటికే బోగీ సగం కాలిపోయింది. కాస్త ఆలస్యం అయి ఉంటే పెను ప్రమాదం సంబవించి ఉండేదని అంటున్నారు.. వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు అంటున్నారు.
అగ్ని ప్రమాదం కారణంగా నవజీవన్ ఎక్స్ ప్రెస్ గూడూరులోనే స్టేషన్ లోనే సుమారు గంట వరకు ఆగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. బోగీలో మంటలు చెలరేగడానికి గట కారణాలపై ఆరా తీస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు..కానీ అప్పుడప్పుడు ఇటాంటి ప్రమాదాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటారు.