రాజకీయాల్లో పాదయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యాత్ర ద్వారా నేతలు జనంతో మమేకమవుతూ.. వారి కష్టాలను, ఇతర సమస్యలు తెలుసుకుంటారు. అలానే కొన్ని రకాల హమీలు ఇస్తూ.. ముందుకు సాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టి.. అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాద యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత లోకేష్ త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈయాత్ర గురించి నారా లోకేష్ సోదరుడు, నారా రోహిత్ పలు వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రం బాగుండాలంటే మరోసారి చంద్రబాబు నాయుడు రావాలని నారా రోహిత్ అన్నాడు.
ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా రోహిత్.. లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర గురించి అనేక విషయాలను షేర్ చేసున్నాడు. అంతేకాక ఈ పాదయాత్రలో తనపాత్ర ఎంత మేరకు ఉంటుందనే విషయాన్ని కూడా వెల్లడించారు. నారా రోహిత్ మాట్లాడుతూ.. ” ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నారు. కచ్చితంగా మేము కూడా ఈ యాత్రలో పాల్గొంటాము. యువత తమ వాయిస్ ను వినిపించేందుకు యువగళం పాదయాత్ర అనేది మంచి ఫ్లాట్ ఫామ్. రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ.. తాము ఇచ్చిన మ్యానిఫెస్టో ప్రకారం ఏమి చేయలేదు. యువతకు ఉద్యోగల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. యువత.. తమ సమస్యల గురించి యువగళం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు.
2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక.. యువతకు ఏం చేయాలనే విషయంలో ప్రణాళికను సిద్దం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంది. కొత్త పరిశ్రమలు రాలేదు, ఐటీ సెక్టార్ డెవలప్ కాలేదు. ఇవన్నీ అభివృద్ధి చెంది ఉంటే.. ఇక్కడి యువత పక్క రాష్ట్రానికి వెళ్లి.. జాబ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటే ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకోచ్చే వారు. అలానే యువతు జాబ్ గ్యారెంటీ కచ్చితంగా ఉండేది. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. జీవో నం.1 అనేది ప్రతిపక్షాల గొంతులు నొక్కేందుకే తీసుకొచ్చారు. లోకేష్ చెప్పట్టబోయే యువగళం పాదయాత్రలో తప్పకుండా నా భాగస్వామ్యం ఉంటుంది.
అవకాశం కుదిరినప్పుడల్లా ఆయనతో మేము కూడా నడుస్తుంటాము. అంతేకాక సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు లోకేష్ అన్నకు, అటు పవన్ కల్యాణ్ కు తప్పకుండా మద్దతుగా నిలబడతాము. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక్క సినీ పరిశ్రమ నుంచే కాకుండా ఇతర రంగాల నుంచి, యువత నుంచి ఈ యువగళ కార్యక్రమానికి మద్దతుగా ఉండాలి. రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు లోకేష్ అన్న పాదయాత్రకు సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తనే. పార్టీకి నేను ఏ విధంగా ఉపయోగపడతానో అదే స్థాయిలో కృషి చేస్తాను” అని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. మరి.. యువగళం పాదయాత్రపై నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.