టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ బావ బావమరుదులు మాత్రమే కాక వియ్యంకులు కూడా. నారా లోకేష్‌కి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఓ కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం అనగా.. 2007, ఆగస్ట్ 26న లోకేష్-బ్రాహ్మణిల వివాహం జరిగింది. ఇరు కుటుంబాల అంగీకరంతో.. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. బ్రాహ్మణిని కోడాలిగా చేసుకోవాలని ఎంతో ఆరాటపడి.. బాలయ్యను ఒప్పించి మరి తన కోడలిగా చేసుకున్నారట చంద్రబాబు భార్య భువనేశ్వరి. ఇక వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా లోకేష్-బ్రాహ్మణిల నిశ్చితార్థం వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిలో అక్కినేని నాగార్జున, సురేష్ బాబు, వెంకటేష్, రాఘవేంద్రరావు తదితరులు కనిపించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.