నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, సగమనించిన పైలట్ చాకచాక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లి.. అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు. 4 గంటలుగా రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.