ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాక సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖలో ముద్రగడ.. రాధాకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. నోట్ల రద్దు సమయంలో రాధాకృష్ణ బంగారు షాపులు యజమానులను బెదిరించి నల్లడబ్బును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: మోహన్ బాబుకి 300 కొబ్బరి కాయలు పంపిన ముద్రగడ! ఎందుకంటే?
పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని ముద్రగడ తెలిపారు. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరునిగా చేయడం కోసం కాదని ముద్రగడ స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడిని.. చేతకాని వాణ్ణి కాదని ముద్రగడ అన్నారు. రాధాకృష్ణలాగా.. ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యాజమానిని ఇంత వరకు చూడలేదంటూ ముద్రగడ అసహనం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకి ముద్రగడ లేఖ! అందుకే ఆత్మహత్య చేసుకోలేదంటూ..ఆంధ్రజ్యోతి యాజమాని కేఎల్‌ఎన్ ప్రసాద్‌ను కూర్చిలోంచి కాళ్లుపట్టుకొని లాగి.. ఆ కుర్చిలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని ముద్రగడ విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదని దుయ్యబట్టారు. ‘‘నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి. ఎందుకంటే మీలా అపర కోటేశ్వరులు అవ్వలేరు. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యాజమానులను బెదిరించి ఏలా చలమణిలోకి తెచ్చారో? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు(రాధాకృష్ణను ఉద్దేశిస్తూ) ప్రజలకు చెప్పాలి. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి’’ అంటూ రాధాకృష్ణపై ముద్రగడ ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.