ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఇప్పటి నుంచి తమ పోటాపోటీగా ప్రచారాలు మొదలు పెట్టారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తుంటే.. పాదయాత్ర, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార పార్టీపై విమర్శలతో గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. తాజాగా బైక్ ర్యాలీ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వర రావుకి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవాలని అధికార, ప్రతిపక్ష నేతలు ర్యాలీలు, బహిరంగ సభలు, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా మంత్రి కారుమూరు నాగేశ్వర రావుకు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించిన ఆరు ప్రధాన హామీలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అవమానిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో బైక్ ర్యాలీ నిర్వమించారు. ఈ ర్యాలీలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తన కుమారుడిని బుల్లెట్ పై ఎక్కించుకొని నడిపారు.
ఈ క్రమంలోనే మంత్రి నడుపుతున్న బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. వెంటనే పక్కన ఉన్న కార్యకర్తలు ఆయనను లేపారు. ఈ ప్రమాదంలో మంత్రికి ఆయన కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తర్వాత బైక్ ర్యాలీతోముందుకు సాగారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమారు రెండు వేల మందితో ఈ బైక్ ర్యాలీ కొనసాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ఆల్ ఫ్రీ హామీలతో వచ్చారు.. పేద ప్రజలకు అంటే ఆయనకు లేక్కలేదు.. అందుకే వారికి ఇచ్చే ఇళ్ల స్థలాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు.