నేరం చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. అలాంటిది పోలీసులే నేరం చేస్తే.. వారికి కూడా శిక్ష తప్పదని న్యాయస్థానం తెలిపింది. తాజాగా ఓ కేసులో భాగంగా ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే?
మాములుగా ఎవరైన నేరం చేస్తే వారికి శిక్ష పడేంత వరకూ పోలీసులు ఆ కేసును ఫాలప్ చేస్తారు. మరీ, అదే పోలీసులు నేరం చేస్తే.. ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనంటూ న్యాయస్థానం చెబుతుంది. అయితే అచ్చం ఇలాగే ఓ నేరానికి పాల్పడిన ఓ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లకు తాజాగా న్యాయంస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలు ఆ పోలీసులు చేసిన నేరమేంటి? ఎందుకు వారికి జైలు శిక్ష విధించారనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది 2013 అక్టోబర్ 6 రాత్రి 9 గంటల ప్రాంతం. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన అధరశెట్టి చంద్రశేఖర్ అనే గిరిజన యువకుడు ఇంట్లో ఉన్నాడు. ఈ సమయంలోనే అప్పటి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బీబీ గణేష్, కానిస్టేబుళ్లు అయిన.. టి. సంతోష్ కుమార్, ఏ. గణేష్, పీవీవీ. రామకృష్ణలు వచ్చి ఇంట్లో ఉన్న అధరశెట్టి చంద్రశేఖర్ ను ఎటువంటి ఫిర్యాదు, కేసు లేకుండానే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇక తర్వాత అతడిని రాత్రంతా లాకప్ లో ఉంచి.. అతడిపై దాడి చేసి చిత్ర హింసలకు గురి చేశారు.
ఆ తర్వాత అధరశెట్టి చంద్రశేఖర్ తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని స్టేషన్ లో ఉన్న అతని కుమారుడిని తీసుకెళ్లారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ దారుణ ఘటనపై స్పందించిన ఓ పౌర హక్కల నేత.. బాధితుడి తరుఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇక విచారణలో భాగంగా అధరశెట్టి చంద్రశేఖర్ కు చికిత్స అందించిన వైద్యులు సైతం కోర్టులో తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇక ఈ కేసుకు సంబంధించిన అన్ని పరిశీలించిన న్యాయస్థానం.. తాజాగా సంచలన తీర్పును వెలువరించింది.
అన్యాయంగా అధరశెట్టి చంద్రశేఖర్ ని చిత్రహింసలకు గురి చేసిన అప్పటి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బీబీ గణేష్, కానిస్టేబుళ్లు అయిన.. టి. సంతోష్ కుమార్, ఏ. గణేష్, పీవీవీ. రామకృష్ణలు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ కేసులో ఎస్సై కి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా, నలుగురు కానిస్టేబుళ్లకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇక దీంతో పాటు బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం కూడా అందించాలంటూ తీర్పును వెలువరించింది. ఇక కోర్టు తీర్పుతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.