ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం బాగా హీటెక్కుతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతు పెరుగుతోంది. దానిలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్ 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి జగబర్దస్త్ ఫేమ్ అప్పారావు తన పూర్తి మద్దతు తెలిపారు. విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నాను అన్నారు. విశాఖపట్నం కళాకారుడిగా ‘మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ గర్జనను విజయవంతంగా చేయాలని.. ‘‘మన విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియలో అందరం మద్దతు ఇవ్వాలని’’ ఈ సందర్భంగా అప్పారావు పిలుపునిచ్చారు.
విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని కోరుతున్నానని.. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు అప్పారావు. తాను కూడా అక్టోబర్ 15న విశాఖకు వస్తున్నాను అని.. అందరూ రాజధానిగా విశాఖకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతేకాక ‘మన విశాఖ-మన రాజధానికి నా మద్దతు ఉంటుంది’ అన్నారు. అప్పారావు జగన్ సర్కార్ తీసుకున్న వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వడంతో.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆయన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. రాజకీయ అంశాలతో అప్పారావుకు సంబంధం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అప్పారావు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక అప్పారావు విశాఖను రాజధానిగా చేయాలంటూ పిలుపునివ్వడం వెనక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అప్పారావు సొంత ఊరు విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం. జిల్లా వాసిగా.. విశాఖను రాజధానిగా చేయాలని ఆయన కోరారు. అప్పారావుకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు ఆయన 250కు పైగా సినిమాలు, 70కి పైగా సీరియల్స్‌లో నటించారు. ఇక అప్పారావుకు చిన్నతనం నుంచి నాటకాలు అంటే ఇష్టం. శుభవేళ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో పాల్గొన్నారు. దాని ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అప్పారావు విశాఖవాసి కావడంతో ఆ ప్రాంతంపై అభిమానంతో మూడు రాజధానులకు జై కొట్టారు. స్థానికుడిగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర గర్జనకు నేను సైతం అంటున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు pic.twitter.com/HA4h8HkX1h
— DS (@DeepthiSriDS) October 14, 2022