త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అధికార పార్టీ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచే పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ.. తమకు మరోసారి ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ అభివృద్దికి పెద్ద పీట వేస్తామని వెళ్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ఇప్పటి వరకు అధికార పార్టీ చేసింది ఏమీలేదని.. ఇచ్చిన హామీలు కూడా ఏవీ సరిగా నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బుగ్గనకు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఏపి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. బేతంచెర్లలో బుగ్గన పర్యటనలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో గందరగోళం ఏర్పడింది. వెంటన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయిన ఆయనను సురక్షితంగా కాపాడారు. బుధవారం కనుమకింద కొట్టాల సమీపంలో ఉన్న ఎర్రజాల గుహల అభివృద్ది పనులను మంత్రి బుగ్గన పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న తేనటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 70 మంది వరకు గాయాపడ్డట్లు సమాచారం. తేనటీగలు దాడి చేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డులు మంత్రి బుగ్గనను అక్కడ నుంచి క్షేమంతగా తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
తేనెటీగల దాడిలోగాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముద్దవరం పంచాయతీ సెక్రటరీ నాయక్ పై తేనటీగలు తీవ్రంగా దాడి చేయడంతో ఆయన పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను మంత్రి పలకరించారు. తేనటీగల దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.