ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. టెక్నికల్ లోపాలు, మానవ తప్పిదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రైళ్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.
ఈ మద్య దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 288 చనిపోగా మరోకరు చికిత్స పొందుతూ చనిపోయారు. వందల మంది గాయాలతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన తర్వాత కూడా పలు చోట్ల రైల్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో రైలు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్ల వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలో తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 3.35 నిమిషాలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ట్రాప్ పూర్తి దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో జన్మభూమి ఎక్స్ ప్రెస్, విశాఖ నుంచి గుంటూరు కు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్, రత్నాచల్ – ఉదయ్ ఎక్స్ ప్రెస్ లను ఈ రోజు వరకు రద్దు చేశారు. అలాగే గుంటూరు నుంచి విశాఖ వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రేపటి వరకు అంటే జూన్ 15 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరోవైపు విశాఖ-సికింద్రా బాద్ మద్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు మూడు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారుల పేర్కొన్నారు.