ఈ మధ్యకాలంలో ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ ప్రమాదల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఏదైనప్పటికి ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకప్రాయంగా గడుపుతున్నారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ లాడ్జీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పది మంది చనిపోయారు. అలానే మరో ప్రాంతంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. తాజాగా ఓ ఈ-బైక్ లో షోరూమ్ లో అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 10 బైక్ లో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
బుధవారం కాకినాడలోని ఓ ఈ-బైక్ షోరూమ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సరళ ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించి, మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్ లో ఓ వ్యక్తి ఉన్నాడు. అయితే సదరు వ్యక్తి వెంటనే షోరూమ్ నుంచి బయటకు వచ్చేయడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. షోరూమ్ లోపల ఎలక్ట్రిక్ బైక్‌లు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. చాలా సమయం పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో నిండిపోయింది. షోరూమ్ లో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో 10 ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి అహుతయ్యాయని, సుమారు రూ.9 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని ఏడీఎఫ్ వో ఏసుబాబు తెలిపారు. షోరూమ్ యజమాని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. వేసవి కాలం రాక ముందే ఇలా తరచూ అగ్నిప్రమాదలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రానున్నది వేసవికాలం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరి.. ఈ అగ్నిప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.