గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వర్షాలు కురుస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ప్రభావంతో విశాఖలో వర్షం బీభత్సం సృష్టించింది. జవాద్ తుపాను మరింత బలపడి తీవ్రతుపానుగా మారింది. జవాద్ తుపానుపై భారత వాతావరణ కేంద్రం తాజా అప్ డేట్ ను ఇచ్చింది. ఇవాళ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి.. అక్కడి నుంచి ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది కేంద్రీకృతమైనట్టు వెల్లడించింది.
విశాఖపట్నానికి ఈశాన్యాన 210 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి నైరుతిన 410 కిలోమీటర్లు, పారాదీప్ కు నైరుతి దిక్కున 490 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పింది. గంటకు 6 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రాబోయే 12 గంటల్లో పూరీ తీరానికి చేరి అది తీవ్రమైన వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్ ఎలర్ట్ జారీచేశారు.
మరోవైపు సహాయ కార్యకలాపాల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అప్రమత్తమైంది. 64 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు 46 బృందాలను పంపామని, మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయి అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
#WATCH | Odisha: People vacating the Puri beach area with their make-shift shops & belongings, while the deployed police expedite the process in the wake of #CycloneJawad pic.twitter.com/eGfUkEsBUA
— ANI (@ANI) December 4, 2021
CS ‘JAWAD’ over westcentral Bay of Bengal moved slightly northwards with a speed of 04 kmph during past 06 hours and lay centered at 0530 hrs IST of today, about 230 km southeast of Vishakhapatnam, 410 km south-southwest of Puri and 490 km south-southwest of Paradip (Odisha). pic.twitter.com/Pa93dSikcF
— India Meteorological Department (@Indiametdept) December 4, 2021